అనూహ్యంగా వచ్చిన అవసరాల రాజకీయంతో ఏర్పడిన దోస్తీతో కలిసి...ఆదర్శ నేతలుగా తెలుగు రాష్ట్రాలను పరిపాలించాలని తీర్మానించుకొని...అంతలోనే నీటి పంచాయతీ తో వివాదాల సుడి గుండంలో చిక్కుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీరు రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది. పోతిరెడ్డిపాడుతో మొదలైన పేచీ ఈ రెండు రాష్ట్రాల మధ్య ఇప్పుడు ప్రచ్ఛన్నయుద్ధానికి దారి తీస్తోంది. అయితే, తాజాగా ఈ వివాదంలోకి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎంట్రీ ఇచ్చింది. త్వరలో ఈ ఇద్దరు సీఎంలతో భేటీ కానుందట. ఈ విషయాన్ని తెలిపింది భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.
ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జివో నెంబర్ 203ను ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తప్పుపట్టారు. 150 టీఎంసీల నీటిని ఏపీ అదనంగా తీసుకెళ్తోందని అభ్యంతరం వ్యక్తం చేశారు. పోతిరెడ్డిపాడు నీటి సామర్ధ్యం పెంపు విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేసేలా కుట్రలు పన్నుతోందని మండిపడ్డారు. దీన్ని తెలంగాణ శాఖ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేస్తే సహించేది లేదని తెలిపారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ కు లేఖ రాశామని బండి సంజయ్ తెలిపారు. ఆయన తక్షణమే స్పందించి త్వరలోనే అఫెక్స్ కమిటీ సమావేశం ఏర్పాటు చేయాలని కేఆర్ఎంబీని ఆదేశించారని తెలిపారు.ఇది తెలంగాణ బీజేపీ శాఖ చేసిన ప్రయత్నానికి ఫలితంగా భావిస్తున్నామని బండి సంజయ్ అన్నారు.
ఇదిలాఉండగా - టీఆర్ ఎస్ నేత - శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. పోతిరెడ్డిపాడు నుంచి 88 వేల క్యూసెక్కుల నీటిని తరలించాలని ఏపీ సీఎం జగన్ భావించడం అత్యాశనే అన్నారు. పులిచింతల ప్రాజెక్టుతో పాటు పోతిరెడ్డిపాడు విషయంలో ప్రస్తుతం ఇద్దరు ఎంపీలు.. అప్పటి ఎమ్మెల్యేలు మద్దతు ఇచ్చారని.. కాంట్రాక్టులు కూడా తీసుకున్నారని అన్నారు. కేసీఆర్ సీఎంగా ఉండగా పోతిరెడ్డి పాడు నుంచి 88 వేల క్యూసెక్కుల నీటి తరలింపు జరగదని భావిస్తున్నాను అన్నారు.