వారు ఆదర్శ దంపతులు. రాజకీయాల్లోకి వస్తే ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు అన్ని పార్టీలు వారివేనట. ఇది పొగడ్తా లేక విమర్శా అంటే సెటైర్ కే కేరాఫ్ అడ్రస్ గా ఉంటూ నిత్యం సోషల్ మీడియాలో తాను ఏం మాట్లాడిన తెగ వైరల్ అయ్యే సత్తా ఉన్నా సినీ నటుడు నిర్మాత బండ్ల గణేష్ కే తెలియాలి. బండ్ల గణేష్ చక్రం ఎపుడు ఎటు తిరుగుతుందో ఎవరి మీద పంచ్ పడుతుందో బహుశా ఆయనకు కూడా తెలియదు.
ఇక బండ్ల ఎపుడు ఎవరికి పొగుడుతారో కూడా తెలుసుకోవడం కష్టం. ఆయన ప్రస్తుతం తన బాణాన్ని ఎక్కుపెట్టింది జీవితా రాజశేఖర్ల మీద. వీరిని ఆదర్శ దంపతులు అని సంభోదించారు. అంతే కాదు, అన్ని పార్టీలలో కలియతిరిగారు అని కూడా ఘాటైన కామెంట్స్ చేశారు.
ఇపుడు మళ్లీ బీజేపీలోకి వెళ్ళిన జీవిత తగుదునమ్మా అని టీయారెస్ సర్కార్ మీద విమర్శలు చేస్తోంది అని బండ్ల అంటున్నారు. నిజానికి జీవిత అన్నదేంటి అంటే కేసీయార్ ఫ్యామిలీకి కేవలం లిక్కర్ స్కాములే కాదు చాలా స్కాములతో సంబంధాలు వాటాలు ఉన్నాయని. నిజానికి ఇది ఘాటైన విమర్శగానే చూడాలి.
సరే దానికి కౌంటర్ ఇవ్వడానికి టీయారెస్ లో చాలా మంది లీడర్స్ ఎపుడూ రెడీగా ఉంటారు. అయితే వారికి జీవితారాజశేఖర్ మీద కామెంట్స్ చేయడం ఎందుకు, అంత అవసరమా అని అనిపించి ఉండొచ్చు. కానీ అదే సినీరంగంలో ఉన్న బండ్లన్న మాత్రం పూసుకున్నారు. అంతే ఆయన టీయారెస్ కి వకాల్తా పుచ్చుకుని జీవితా రాజశేఖర్ మీద విమర్శలు చేశారు.
అన్ని పార్టీలలో తిరిగారు ఆదర్శ దంపతులు అని కామెంట్స్ చేశారు. సరే జీవితా రాజశేఖర్ అన్ని పార్టీల కండువాలు కప్పుకున్నారు. మరి బండ్లన్న మాటేంటి అన్న వారూ లేకపోలేదు. ఆయన ఘడియకు ఒకసారి చంద్రబాబుకు జై అంటారు, ఇంకోసారి టీయారెస్ ని పొగుడుతారు. మరోసారి కాంగ్రెస్ లో చేరి వారికి ప్రచారం చేస్తారు. ఆయన కూడా అన్ని పార్టీల చుట్టూ తన మెదడుని వాడిన వారే అని అంటున్నారు.
అయితే కండువాలు కప్పుకున్నది మాత్రం జీవితారాజశేఖరే. ఆ మాటకు వస్తే సినీ రంగంలో చాలా మంది అనేక రకాలైన కండువాలు కప్పుకున్నరు, తరువాత పక్కన పెట్టేశారు. ఏది ఏమైనా బండ్లన్న సీరియస్ గానే కామెంట్స్ చేశారు. దానికి జీవితా రాజశేఖర్ నుంచి ఎలాంటి రిటార్ట్ వస్తుందో చూడాల్సిందే.