అమెరికా అధ్యక్ష ఎన్నికలంటే ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి ఉంటుంది. ఇప్పటికే కొన్నాళ్లుగా సాగుతున్న ప్రక్రియ ప్రపంచమంతా ఆసక్తిగా గమనిస్తోంది. ట్రంప్ వ్యాఖ్యలు.. హిల్లరీకి ఆదరణ వంటివాటిపై చర్చించుకుంటున్నారు. అయితే.. ఎన్నికల ప్రక్రియ తుది అంకానికి చేరుకుంటున్న తరుణంలో చోటు చేసుకుంటున్న కీలక పరిణామాలు ఈసారి అమెరికా అధ్యక్ష పదవిని మహిళ చేపడతారన్న సంకేతాలిస్తున్నాయి. హిల్లరీ క్లింటన్ అధ్యక్ష పీఠం నామినీ స్థానాన్ని దక్కించుకోవడం... ఆమెకు మద్దతుగా ఒబామా నిలవడంతో ఆమె ఎన్నిక లాంఛనమేనని తెలుస్తోంది. ఇప్పటికే రెండుసార్లు అధ్యక్ష పీఠాన్ని దక్కించుకున్న డెమొక్రటిక్ పార్టీ మూడోసారి కూడా ఆ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు ఇప్పుడు వేగం పెంచుతోంది. హిల్లరీ గెలిస్తే మరోసారి అమెరికా అధ్యక్ష పేరులో క్లింటన్ పదవి వినిపించనుంది.. అంతకంటే ముఖ్యంగా అగ్రరాజ్యానికి తొలి అధ్యక్షురాలిగా రికార్డు సృష్టించబోతుంది.
హిల్లరీకి మద్దతుగా ప్రస్తుత అధ్యక్షుడు బరాక్ ఒబామా తాజాగా ఓ వీడియోను కూడా విడుదల చేశారు. డెమొక్రటిక్ అభ్యర్థి అయిన ఆయన తాను హిల్లరీకి మద్దతు పలుకుతున్నానని ఆ వీడియోలో తెలియజేశారు. స్వల్ప వ్యవధిలో కనిపించిన ఆ వీడియోను ఐయామ్ విత్ హిల్లరీ అనే పేరుతో విడుదల చేశారు. 'ఇప్పటికే కోట్ల మంది ప్రజలు తమ గొంతులను వినిపించారు. ఇప్పుడు నా గొంతును కూడా వారితో కలుపుతున్నాను. నేను కూడా మీలాగా హిల్లరీతోనే ఉన్నాను. నేను ఆమెకు పూర్తి మద్దతు నిస్తాను' అని ఆయన అన్నారు. ఒబామా కేవలం హిల్లరీకి మద్దతు తెలిపి ఊరుకోలేదు.. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్ పై తీవ్ర వ్యాఖ్యలు కూడా చేశారు. తెలివైన ఏ అమెరికన్ కూడా ట్రంప్ ను అధ్యక్షుడిగా ఎన్నుకోరు అని ఒబామా తన పాత మాటను మరోసారి చెప్పారు. కాగా ఒబామా మద్దతు ఇవ్వడం హిల్లరీకి మేలి మలుపని విశ్లేషకులు చెబుతున్నారు. ఒబామా పాలనపై అమెరికన్లు బాగా సంతృప్తిగా ఉన్నారు. కాబట్టి ఆయన తన మద్దతు ప్రకటించడం కలిసొచ్చే విషయమని అంటున్నారు. ఎన్నికల ప్రచారంలో ఒబామా కూడా హిల్లరీకి తోడుగా చేరితే హిల్లరీకి విజయం ఖాయం అంటున్నారు.అయితే.. ట్రంప్ నుంచి గట్టి పోటీ ఉండడంతో హిల్లరీ గెలుపు నల్లేరు మీద నడక కాదన్న వాదనా వినిపిస్తోంది.
Full View