ఏపీలో బీసీలకు రాజ్యాధికారం మాత్రమే కావాలని, అది తప్ప మరేదీ తమకు అవసరం లేదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ క్రిష్ణయ్య అంటున్నారు. బీసీలకు ఏవో పదవులు ఇచ్చేసి పక్కన కూర్చోబెడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. తాజాగా విశాఖ టూర్ లో తెలుగు రాజాకీయాన్ని మార్చేస్తామని ఆయన గట్టి వార్నింగ్ ఇవ్వడం విశేషం.
బీసీలు ఎంతకాలం అధికారానికి దూరంగా ఉంటారని ఆయన ప్రశ్నిస్తున్నారు. స్వాతంత్రం వచ్చి డెబ్బై నాలుగేళ్లు నిండాయని, ఈ కాలంలో బీసీలకు కేవలం 14 శాతం మాత్రమే అధికారంలో వాటా దక్కిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలు దేశ జనాభాలో కానీ రాష్ట్రాలలో కానీ యాభై శాతానికి పైగా ఉన్నారని ఆయన గుర్తు చేశారు.
అందుకే చట్ట సభల్లో బీసీలకు యాభై శాతం రిజర్వేషన్ని ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఇక బీసీలను సంఘటిత పరచి ఒక బలీయమైన రాజకీయ శక్తిగా మారుస్తామని ఆయన స్పష్టం చేశారు. రాజ్యాధికారాన్ని సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. అదే విధంగా బీసీలలో కొత్త కులాలను అనేకం కలుపుతున్నారని, బీసీల రిజర్వేషన్ల కోటా పెంచకుండా ఇతర కులాలను చేరిస్తే తాము ఊరుకునే ప్రసక్తి లేదని ఆయన పేర్కొన్నారు.
బీసీలలో గతంలో 96 కులాలు ఉండేవని, అపుడు పాతిక శాతమే రిజర్వేషన్లు ఉన్నాయని, ఆ తరువాత 36 శాతం కులాలను అదనంగా చేర్చారని, కానీ రిజర్వేషన్లు ఎక్కడా పెరగలేదని ఆయన ఫైర్ అయ్యారు. బీసీలు ఏపీ జనాభాలో చూసుకుంటే 56 శాతానికి పైగా ఉన్నారని, అందువల్ల వారికి 56 శాతం రిజర్వేషన్లు కావాలని డిమాండ్ చేశారు.
బీసీల విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉదాశీన వైఖరితో ఉన్నాయని, తమను పట్టించుకోకపోతే తెలంగాణా ఉద్యమం కంటే అతి పెద్ద ఉద్యమాన్ని నిర్మించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సత్తా చాటుతామని క్రిష్ణయ్య హెచ్చరించారు. బీసీల వెల్ఫేర్ కొరకు క్రిష్ణయ్య అన్ని రాజకీయ పార్టీల నుంచి బీసీ డిక్లరేషన్ కోరుతున్నారు. మరి ఏపీ రాజకీయాలు అసలే వేడెక్కి ఉన్న వేళ రాజ్యాధికారమే మా టార్గెట్ అంటూ క్రిష్ణయ్య బిగ్ సౌండ్ చేయడాన్ని చూస్తే పరిణామాలు మరింత జోరుగా మారే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.