బీసీజీ రిపోర్టు..ఎన్ని ప్ర‌త్యేక‌త‌లు ఉన్నాయో చూశారా?

Update: 2020-01-04 04:06 GMT
ఏపీలో రాజ‌ధాని ఏర్పాటుపై నివేదిక రూపొందించిన బోస్ట‌న్ క‌న్స‌ల్టెన్సీ గ్రూప్ ముఖ్య‌మంత్రి జగన్‌కు రిపోర్టు సమర్పించింది. ఈ రిపోర్టు లో అనేక ఆసక్తికర అంశాలున్నాయి. రాష్ట్రం లో అన్ని ప్రదేశాలు తిరిగిన బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్.. ఆయా ప్రాంతాల ప్రజలతో మాట్లాడి ప్రభుత్వానికి పలు సూచనలు చేశారు. రాష్ట్రాన్ని 6 రీజియన్లుగా గుర్తించి.. అక్కడ ఏం వస్తే అభివృద్థి చెందుతుందో సవివరంగా వివరించారు. 13 జిల్లాల ఏపీని ఉత్తరాంధ్ర, గోదావరి డెల్టా, కృష్ణా డెల్టా, దక్షిణాంధ్ర, ఈస్ట్ రాయలసీమ, వెస్ట్ రాయలసీమ ప్రాంతాలుగా గుర్తించాలని సూచించింది.

1. ఉత్తరాంధ్ర (విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం)
2. గోదావరి డెల్టా (తూర్పు గోదావరి, పశ్చిమ‌ గోదావరి)
3. కృష్ణా డెల్టా (కృష్ణా, గుంటూరు)
4. దక్షిణాంధ్ర (నెల్లూరు, ప్రకాశం)

5. ఈస్ట్ రాయలసీమ (కడప, చిత్తూరు)
6. వెస్ట్ రాయలసీమ (అనంత, కర్నూలు)

ఉత్తరాంధ్ర రీజియన్‌లో ఎనలిటిక్స్ అండ్ డేటా హబ్, మెడికల్ సర్వీసులు, టాయ్స్ ఇండస్ట్రీస్, కాఫీ, పసుపు, జీడిపప్పు, హెల్త్, టూరిజం, ఎకో టూరిజం, వెడ్డింగ్, అడ్వెంజర్ టూరిజం, వాటర్ గ్రిడ్, రోడ్ గ్రిడ్, భోగాపురం ఎయిర్ పోర్టు అభివృద్ధి కి అవకాశముంది.

గోదావరి డెల్లా రీజియన్‌ లో పెట్రో కెమికల్స్, ప్లాస్టిక్స్, సోలార్ ఎనర్జీ, ఫుడ్ ప్రాసెసింగ్, హార్టికల్చర్, క్రాస్ క్రాప్స్, ప్రస్తుతం ఉన్నదానికి అదనం గా బ్యాక్ వర్డ్ టూరిజం కోనసీమ, హోప్ ఐలాండ్ అభివృద్ధి, పోలవరం, వాటర్ గ్రిడ్, రోడ్ గ్రిడ్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని బీసీజీ కమిటీ సూచించింది.

కృష్ణా డెల్టాలో ఫుడ్, ఫిషరీస్ ప్రాసెసింగ్, సిరామిక్స్, మల్టీ మోడల్ లాజిస్టిక్ హబ్స్, హైటెక్ ఆర్గానిక్ ప్రాసెసింగ్,
ఎడ్యుకేషన్ హబ్‌గా, మచిలీపట్నం ఫుల్ ప్లెజ్డ్ పోర్ట్ ఏర్పాటు చేస్తే ఆ ప్రాంతాభివృద్ధి సాధ్యమవుతుందని బోస్టన్ కమిటీ తెలిపింది.

- దక్షిణాంధ్ర లో ఆటోమోటివ్ ఇండస్ట్రీస్, ఆటో పార్ట్స్, టెలికాం ఎక్విప్‌మెంట్, లెదర్, పేపర్, ఫర్నీచర్‌, ఫిషరీస్ డైవర్సిఫికేషన్, మైపాడు బీచ్ అభివృద్ధి కి అవకాశాలున్నాయి.
- వెస్ట్ రాయలసీమ లో ఆటోమోటివ్, ఆటో పార్ట్స్, సర్క్యూట్ టూరిజం, మల్లీ మోడల్ లాజిస్టిక్ హబ్స్ (కర్నూలు), బెంగళూరు కు ప్రత్యామ్యాయంగా అనంతపురం అభివృద్ధి, హైదరాబాద్‌కు ప్రత్యామ్నాయంగా కర్నూలు అభివృద్ధి చేయాలి.
- ఈస్ట్ రాయలసీమలో స్టీల్ ఇండస్ట్రీస్, ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీస్, హైటెక్ హార్టికల్చర్, కోల్డ్ స్టోరేజీలు, ఎకో టూరిజం, బెలూన్ కేవ్, గండికోట అభివృద్ధికి అవకాశముంది.

ఇక ప‌రిపాల‌న విష‌యంలో మూడు ఆప్ష‌న్ల‌ను ప్ర‌తిపాదించింది.

ఆప్షన్‌ 1*


విశాఖపట్నం గవర్నర్, సీఎం ఎస్టాబ్లిష్‌మెంట్స్‌
విశాఖలో సచివాలయం, ప్రభుత్వ కార్యాలయాలు, ఇండస్ట్రీ–ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ శాఖలు, టూరిజం శాఖ
అత్యవసర సమావేశాలకోసం అసెంబ్లీ, హైకోర్టు బెంచ్‌..

అమరావతిలో అసెంబ్లీ, ఎడ్యుకేషన్‌కు సంబంధించి మూడు హెచ్ఓడీ కార్యాలయాలు, అగ్రికల్చర్‌కు సంబంధించి నాలుగు హెచ్ఓడీ కార్యాలయాలు,

సంక్షేమ–స్థానిక సంస్థలకు సంబంధించి 8 హెచ్ఓడీ కార్యాలయాలు, హైకోర్టు బెంచ్‌

కర్నూలులో హైకోర్టు, స్టేట్‌ కమిషన్లు, అప్పిలేట్‌ సంస్థలు

*ఆప్షన్‌ 2*

విశాఖ: సచివాలయం, గవర్నర్‌ – సీఎం ఎస్టాబ్లిష్‌మెంట్లు, అన్ని ప్రభుత్వ శాఖలకు చెందిన హెచ్ఓడీ కార్యాలయాలు, అత్యవసర సమావేశాల కోసం అసెంబ్లీ, హైకోర్టు బెంచ్‌

అమరావతిలో అసెంబ్లీ, హైకోర్టు బెంచ్‌

కర్నూలులో హైకోర్టు, స్టేట్‌కమిషన్లు, అప్పిలేట్‌ సంస్థలు


Tags:    

Similar News