పెంపుడు జంతువుల‌తో జాగ్ర‌త్త‌.. లేక‌పోతే ప్ర‌మాద‌మే?

Update: 2021-07-06 08:36 GMT
మ‌నుషుల‌కు, జంతువుల‌కు విడ‌దీయ‌లేని బంధం ఉంది.  ప్ర‌తి ఒక్కరి ఇంట్లో కుక్క‌, పిల్ల‌, లేదా ఇత‌ర జంతువుల‌ను పెంచుకుంటారు. గ్రామాల‌లో అయితే సహ‌జంగా జంతువుల‌ను పాలు, మాంసం కోసం వాటిపై ఆధార‌ప‌డుతున్నారు. అయితే జంతువుల నుంచి మ‌నుషుల‌కు కొన్ని ర‌కాల వ్యాధులు ప్ర‌బ‌లే ప్ర‌మాదం ఉంద‌ని వైద్య నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. జంతువుల నుంచి  రేబిస్, మెదడువాపు, బర్డ్‌ ఫ్లూ, ఎబోలా, ప్లేగు, ఆంథ్రాక్స్‌ వంటి అనేక రకాల వ్యాధులు వ‌చ్చే ప్ర‌మాదం ఉంది.

పెంపుడు జంతువుల ప‌ట్ల మ‌నుషులు అప్ర‌మ‌త్తంగా ఉండాల్సిన అవ‌స‌రం ఉంది. జంతువుల‌ను తాకిన‌ప్పుడు   చేతులు శుభ్రం చేసుకోవాలి.  అంతేకాకుండా  ఇంట్లో పెంపుడు జంతువుల‌కు స‌కాలంతో టీకాలు వేయించ‌డంతో వ్యాధులు ప్ర‌బ‌ల‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌చ్చు. ప్ర‌తి సంవ‌త్స‌రం జులై 6న ప్ర‌పంచ జూనోసిడ్ డే సంద‌ర్భంగా పెంపుడు జంతువుల‌కు టీకాలు ఉచితంగా అందిస్తున్నారు.

జులై 6న ప్ర‌పంచ జూనోసిడ్ డే జ‌రుపుకోవ‌డానికి కొంత చ‌రిత్ర ఉంది. 1885 జూలై 6న లూయిస్‌ పాశ్చర్‌ అనే శాస్త్రవేత్త  కుక్క కాటుకు వ్యాధి నిరోధ‌క టీకాను కొనుగోన్నారు. దీంతో అప్ప‌టి నుంచి ప్ర‌తి ఏటా జులై 6న  ప్రపంచ జూనోసిస్ డే నిర్వ‌హిస్తున్నారు.

ప‌శువుల కాప‌రులు, ప‌శువైద్యాధికారులు, డెయిరీ ఫాంల‌లో ప‌ని చేసే వారు, కుక్క‌ల‌ను, ఇత‌ర జంతువుల‌ను పెంచుకునే వారికి వ్యాధి సంక్ర‌మించే అవ‌కాశం ఉంది.  జూనోసిస్‌ వ్యాధుల బారిన పడకుండా ప్ర‌తి ఒక్క‌రూ  ప‌రిశుభ్ర‌త పాటించాలి.

ఏమైన చోరీలు, హ‌త్య‌లు జ‌రిగిన‌ప్పుడు స్నీప‌ర్‌డాగ్ కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నాయి. నేర‌స్తుల ఆచూకి తెలిపి పోలీసులు స‌హ‌క‌రిస్తున్నాయి. అవి అలా చేయ‌డంతో శిక్ష‌ణ ఇచ్చే వారి పాత్ర కీల‌కం. వారు వాటికి ప్ర‌తి రోజు భోజ‌నం పెట్ట‌డం, వాటికి శిక్ష‌ణ ఇవ్వ‌డం, వాటితో మ‌మేకం అవుతుంటారు. ఇలాంటి వారు మ‌రింత జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సి ఉంటుంది.  

చిన్న‌ పిల్ల‌లు కుక్క‌ల‌ను పెంచుకుంటారు. కొని సంద‌ర్భాల్లో జంతువులు వారిని క‌రిచిన‌ప్పుడు  యాంటీ రేబీస్‌ టీకాలు వేయించుకోవాలి. లేక‌పోతే ప్రాణాపాయం ఉండే ప్ర‌మాదం ఉంది.  ప‌శువుల డాక్ట‌ర్ వ‌ద్ద‌కు జంతువుల‌ను తీసుకెళ్లి పెంపుడు జంతువుల‌కు వ్యాధులు ప్ర‌బ‌ల‌కుండా టీకాలు వేయించాలి.  వ‌ర్షాకాలంలో ఎక్క‌వ‌గా నీరు నిల్వ‌డంతో పందులు, దోమ‌లు తిరుగుతు ఉంటాయి. వాటి ద్వారా మెద‌డు వాపు , కుక్క కాటుతో రేబిస్ వ్యాధి వ‌చ్చే ప్ర‌మాదం ఉంది.  ఇంట్లో కుక్క‌ను పెంచుకునే వారు స‌కాలంలో ప‌శువైద్యాధికారుల‌ను సంప్ర‌దించి వారి సూచ‌న‌లు, స‌ల‌హాలు తీసుకోవాలి. ఇప్పుడే జంతువుల నుంచి సంక్ర‌మించే వ్యాధుల‌ను అరిక‌ట్ట‌వ‌చ్చు అని ప‌శువైధ్యాధికారులు చెబుతున్నారు.
Tags:    

Similar News