చాక్లెట్ తింటే ఎన్ని లాభాలో తెలిస్తే.. ఇక వదిలిపెట్టరంతే

Update: 2022-05-14 08:28 GMT
పిల్లలు.. పెద్దలు అన్న తేడా లేకుండా అందరికి ఒకటి చేస్తుంది చాక్లెట్. మిగిలిన బహుమతుల సంగతి ఎలా ఉన్నా.. చాక్లెట్లను గిఫ్టుగా ఇస్తానంటే వద్దనే వారు ఎవరుంటారు చెప్పండి? తాజాగా వెలుగు చూసిన సర్వే రిపోర్టు చూశాక.. చాక్లెట్ల మీద ప్రేమను మరింత పెంచుకోవటమే కాదు.. చాక్లెట్ తినొద్దని వారించే వారిపై విరుచుకుపడటం ఖాయం. ఇంతకూ చాక్లెట్ వినియోగం మీద వచ్చిన సర్వేలో ఏమున్నదన్న విషయంలోకి వెళితే..

కోకో చాక్లెట్లకు  ప్రాణాల్ని నిలిపే కోణం కూడా ఒకటుందన్న విషయం తాజాగా వెల్లడైంది. అంతేకాదు.. అనారోగ్యానికి గురి చేసే ముప్పు నుంచి తప్పిస్తుందన్న విషయం తేలింది. చాక్లెట్లు తినటం వల్ల చిన్న వయసులోనే మరణించే ప్రమాదాన్ని 12 శాతం తగ్గించొచ్చు అన్న విషయం తాజా సర్వే రిపోర్టు వెల్లడించింది. అంతేకాదు ప్రాణాలు తీసే గుండె జబ్బులతో పాటు.. క్యాన్సర్ తో వచ్చే ముప్పు 16 శాతం తగ్గుతుందని స్పష్టం చేశారు.

అంతేకాదు.. వారానికి రెండు సాధారణ సైజలో ఉంటే మిల్క్ చాక్లెట్లను రెగ్యులర్ గా తినే వారికి మధుమేహం వచ్చే ముప్పు కూడా తగ్గుతుందని తేలింది. చాక్లెట్లు బ్యాడ్ కొలెస్ట్రాల్.. రక్తపోటును తగ్గిస్తుందన్న విషయాన్ని గుర్తించారు. చాక్లెట్లలో ఉండే కోకో ఫ్లేవనాయిడ్స్ సమ్మేళనాలు రక్తనాళాల ఆరోగ్యాన్నిపెంచుతాయంటూ బోలెడన్ని ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు. యూఎస్ నేషనల్ క్యాన్సర్ ఇన్ స్టిట్యూట్ కు చెందిన ప్రొఫెసర్జియాకీ హువాంగ్ ఈ విషయాల్ని వెల్లడించారు.

అయితే.. ఈ వ్యాఖ్యల్ని విభేదించింది బ్రిటీష్ హార్ట్ ఫౌండేషన్. గుండెజబ్బుల ప్రమాదాన్ని తప్పించుకోవటానికి చాక్లెట్లు తినొచ్చన్న మాట గురించి మరోసారి ఆలోచించాలని కోరుతున్నారు. దీనిపై మరింత లోతైన పరిశోధన అవసరమన్నారు. అయితే.. చాక్లెట్లపై గతంలో జరిగిన రీసెర్చ్ లోనూ డార్క్ చాక్లెట్లను మితంగా తింటే గుండెజబ్బుల ప్రమాదం నుంచి మూడింట ఒక వంతు తగ్గించుకోవచ్చని స్విస్ శాస్త్రవేత్తలు కూడా పేర్కొన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు.తీవ్రమైన ఒత్తిడి.

ఆందోళనతో ఉన్న వారు డార్క్ చాక్లెట్లనురెండు వారాల పాటు తినిపిస్తే పరిస్థితుల్లో మార్పు వస్తుందన్నారు. అంతేకాదు.. చాక్లెట్లతో జరిగే మేలు మరొకటేమంటే.. ఉప్పు.. కారంగా ఉండే ఫుడ్స్ ను ఎక్కువగా తినకుండా ఉండటానికి.. ఆయిలీ ఫుడ్ ఎక్కువ దరి చేరకుండా చేయటంతోనూ చాక్లెట్ కీలకమని చెబుతున్నారు. ఏటు చూసినా చాక్లెట్ తో కలిగే లాభాల గురించే చెప్పటం ఆసక్తికరంగా మారింది. అంతేకాదు.. రోజువారీగా డార్క్ చాక్లెట్లను రోజువారీగా తింటే బరువు కూడా తగ్గొచ్చన్న మాట చెబుతున్నారు. అయితే.. ఈ కథనం ఆధారంగా చేసుకొని చాక్లెట్లను అతిగా తినమని మేం సిఫార్సు చేయట్లేదన్న విషయాన్ని గుర్తించాలి.
Tags:    

Similar News