ఒకసారి వస్తే ముప్పు.. రెండోసారి వస్తే అది తప్పు.. నిర్లక్ష్యంతో చేసిన ఆ తప్పుకు ఇప్పుడు దేశ ప్రజలు అనుభవిస్తున్నారు. కరోనా మొదటి వేవ్ ముగిసిపోయిందనుకుంటున్న తరుణంలో రెండో వేవ్ దేశంలో కల్లోలం సృష్టిస్తోంది. లక్షల మందికి సోకుతూ వేల మందిని ఆస్పత్రుల పాలు చేస్తోంది. ఆస్పత్రులన్నీ నిండిపోతున్నాయి.
దేశంలో కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తిని అడ్డుకోవడంలో ప్రధాని మోడీ విఫలమయ్యారని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు చేశారు. దేశంలో ప్రస్తుత పరిస్థితులకు బాధ్యత వహిస్తూ ప్రధాని పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
దేశంలో ఆక్సిజన్, వెంటిలేటర్ల కొరతతో వేలాది మంది చనిపోతున్నారని మమతా బెనర్జీ ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో టీకా కొరత తీవ్రంగా ఉంటే.. పేరు ప్రఖ్యాతల కోసం విదేశాలకు మోడీ ఎగుమతి చేస్తున్నారని మమత మండిపడ్డారు.
ఇది ఖచ్చితంగా కేంద్రంలోని మోడీ వైఫల్యమేనని మమత ఆరోపించారు. దేశంలో ఆధిపత్యం ఉందని ఇష్టారాజ్యంగా చేస్తే ఇలాంటి ఫలితాలే వస్తాయని ఆమె విమర్శించారు. ఇప్పటికైనా వేగవంతమైన చర్యలు తీసుకోకపోతే పరిస్థితులు చేయిదాటిపోయే ప్రమాదం ఉందని మమత హెచ్చరించారు.