రూ.5వేల కోట్ల బెట్టింగా అక్కడా?

Update: 2020-02-09 16:30 GMT
ఢిల్లీ ఎన్నికల పోలింగ్ ఘట్టం ముగిసింది. నిన్నటితో ఢిల్లీ ఓటరు తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమైంది. మరి నిన్నటి దాకా హోరా హోరీగా పోరాడిన బీజేపీ - ఆమ్ ఆద్మీ పార్టీల్లో విజయం ఎవరిది? మోడీదా.. మరోసారి కేజ్రీవాల్ దా పీఠం అనేది ఉత్కంఠగా మారింది.

ఈ ఉత్కంఠను కొందరు క్యాష్ చేసుకుంటున్నారు. ఢిల్లీ ఎన్నికల ఫలితాల వేళ బెట్టింగ్ జోరు యమ రంజుగా సాగుతోంది. ఢిల్లీ - దానిపక్కనే ఉండే చంఢీఘడ్ - జైపూర్ - అహ్మాదాబాద్ - ముంబై - బెంగళూరు వంటి నగరాల్లో బెట్టింగులు జోరుగా సాగుతున్నాయట..

ప్రధానంగా బీజేపీ - ఆమ్ ఆద్మీ మధ్య భారీ బెట్టింగ్ నడుస్తోందట.. కాంగ్రెస్ ను అసలు ఎవరూ గెలుస్తుందని బెట్టింగ్ కాయడం లేదట.. చాలా తక్కువమంది కాంగ్రెస్ పై బెట్టింగ్ కాశారట..

ప్రధానంగా ఆమ్ ఆద్మీ అధినేత కేజ్రీవాల్ ఎన్ని సీట్లు గెలుస్తారనే దానిపైనే అతి ఎక్కువ బెట్టింగ్ కాస్తున్నారు. బీజేపీకి వచ్చే సీట్లపై కోట్లలోనే బెట్టింగ్ సాగుతోందట.. మొత్తంగా ఢిల్లీ ఎన్నికలపై దేశవ్యాప్తంగా దాదాపు రూ.5వేల కోట్ల బెట్టింగ్ లు దాటాయని అంచనా.. అయితే పోలింగ్ ముగియగానే వచ్చిన ఎగ్జిట్ పోల్స్ ఢిల్లీ పీఠం కేజ్రీవాల్ దేనని స్పష్టం చేశాయి. దీంతో కేజ్రీవాల్ పై పందెం కాసిన వారు.. కాస్తున్న వారి పంట పండినట్టే.. బీజేపీపై కాసినవారి సొమ్ములు పోయినట్టేనని స్పష్టమవుతోంది.


Tags:    

Similar News