ఒకరకంగా అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆం ఆద్మీ పార్టీ (ఆప్) కు ఎంత మంచి పేరు వచ్చిందో, ఆ పార్టీ లోని కొందరి నాయకుల వల్ల వచ్చిన చిన్న చిన్న సమస్యలవల్ల అంతేస్థాయిలో చెడ్డపేరు కూడా వస్తుంది!! ఈమధయ్కాలంలో పలు వివాదాల్లో చిక్కుకున్న ఈ పార్టీ తాజాగా మరో వివాదంలో చిక్కుకుంది. అయితే దీనికి కారణం అయిన వ్యక్తి చేసిన పనేంటంటే... తాగడం.. తాగి వాగడం.. అనంతరం జారిపడటం!
విషయానికొస్తే... ఆల్ కు చెందిన ఎంపీ భగవంత్ సింగ్ మాన్ తను పాల్గొనాల్సిన ఎన్నికల సభకు మద్యం తాగి వచ్చాడట. భటిండాలోని గోల్ డిగ్గీలో జనవరి 28న జరిగిన ఎన్నికల ర్యాలీకి వచ్చిన ఈయన... ఎనిమిదంకేసినట్లు నడుస్తూ మెల్లగా స్టేజీపై నుంచి ఆ ర్యాలీలో పాల్గొన్న ప్రజలకు ఫ్లయ్యింగ్ కిస్సులు పెడుతూ పెడుతూ... కాసేపటికి సరిగా నిలబడలేక తూలుతూ కింద పడిపోయాడు. దీంతో ఆశ్చర్యపోవడం అక్కడి ప్రజల వంతైంది!
అనంతరం కాస్త తేరుకున్నారో లేక అప్రయత్నంగానే జరిగిందో కానీ... ఐదు నిముషాలయ్యాక లేచి నిలబడిన ఆ ఎంపీగారు... తడబడుతూ తడబడుతూ ఏవేవో మాట్లాడాడట. ఈ విషయాలను తన ట్విట్టర్ లో వెల్లడించిన ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్.. ఆప్ కు చెందిన స్టార్ పెర్ఫార్మర్ అని చెప్పుకునే ఈ ఎంపీ తన సొంత ఎన్నికల సభకే మందు కొట్టి రావడమేంటని ప్రశ్నించాడు. ఇదే క్రమంలో... ఢిల్లీలో మద్యం దుకాణాలను పెంచి పోషిస్తున్న ఈ పార్టీ.. పంజాబ్ లో మాత్రం మద్య నిషేధం విధిస్తామని హామీ ఇస్తోందని ఎద్దేవా చేశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/