కరోనా వ్యాక్సిన్ తయారీ విషయంలో చివరకు భారత్ బయోటెక్ ప్రతిపక్షాలకు టార్గెట్ మారిపోయిందా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు+బయోటెక్ ఎంపి ఎల్లా కృష్ణ వ్యక్తంచేసిన అభిప్రాయాలు చూస్తుంటే ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. తమ ఫార్మా కంపెనీ రూపొందిస్తున్న కరోనా వ్యాక్సిన్ కోవాగ్జిన్ వినియోగానికి అనుమతుల విషయంలో ప్రతిపక్షాలు టార్గెట్ చేయటాన్ని ప్రస్తావించారు.
తమ కంపెనీ ఈరోజు పెట్టిన కంపెనీ కాదన్న విషయాన్ని అందరు గమనించాలని విజ్ఞప్తి చేశారు. వివిధ రకాల వ్యాక్సిన్ల తయారీలో తమకు సుదీర్ఘమైన అనుభవం ఉందని అదీకాకుండా తమ వ్యాక్సిన్లు 123 దేశాల్లో ఉపయోగిస్తున్న విషయాన్ని కూడా కృష్ణ గుర్తుచేశారు. కోవాగ్జిన్ వినియోగానికి కేంద్రం భారత్ బయోటెక్ కు అనుమతులు మంజూరు చేసిన విషయాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా తప్పుపడుతున్నాయి.
సరైన క్లినికల్ ట్రయల్స్ జరపకుండానే వ్యాక్సిన్ కు అనుమతులు ఇవ్వాల్సిన అవసరం ఏమిటంటే కేంద్రాన్ని ప్రతిపక్షాలు తూర్పారబడుతున్నాయి. కోవాగ్జిన్ వినియోగానికి కేంద్రం అనుమతిచ్చిన విషయాన్ని ఎండి ప్రస్తావిస్తు ఇపుడు దేశానికి ఇది చాలా అవసరం కాబట్టే అత్యవసర వినియోగం క్రింద తమకు అనుమతులు ఇచ్చినట్లు చెప్పుకున్నారు. వ్యాక్సిన తయారీ అన్నది ప్రపంచ పఠంలో మనదేశ ప్రిస్టేజిని కచ్చితంగా పెంచేదే అని కూడా అన్నారు.
కోవాగ్జిన్ వ్యాక్సిన విషయంలో తాను రాసిన వ్యాసాలు అంతర్జాతీయ పత్రికల్లో కూడా ప్రచురితమైనట్లు చెప్పారు. కోవాగ్జిన్ వ్యాక్సిన్ ను విమర్శించేవారు ముందు తాను రాసిన జర్నల్స్ ను చదివితే బాగుంటుందని సూచించారు. మొత్తానికి కోవాగ్జిన్ వ్యాక్సిన్ మార్కెట్లోకి రాకముందే వివాదాస్పదమవుతున్న విషయం అర్ధమైపోతోంది.