బాబుకు భరత్ చాలడు....కుప్పంపై వైసీపీ అంతర్మధనం?

Update: 2022-08-27 15:30 GMT
కుప్పం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. దానికి కారణం వైసీపీ అనుసరించిన తప్పుడు వ్యూహమే. చంద్రబాబు కుప్పం టూర్ చాలా ముందుగానే షెడ్యూల్ అయింది. ఆయన టూర్ అలా కానిచ్చేస్తే అది జస్ట్ లోకల్ ఎడిషన్ న్యూస్ గానే ఉండేది. ఇక టీడీపీ అనుకూల మీడియా ఫోకస్ చేస్తే ఏదో  చేసేది. కానీ వైసీపీ రాంగ్ స్ట్రాటజీలతో బాబుకు హైప్ పెంచేసింది. ఆయన అడుగుపెట్టడంతోనే వైసీపీ ఎదురుదాడిని చేయడంతో కుప్పంలో బాబుని ఇబ్బంది పెడుతున్నారన్న మేసేజ్ ఏపీ అంతా వెళ్ళిపోయింది.

ఈ వ్యవహారం ఎక్కడిదాకా పోయింది అంటే జాతీయ స్థాయిలో కూడా చర్చకు దారి తీసింది. ఇక కేంద్రం సైతం బాబుకు ఇస్తున్న కేంద్ర బలగాల భద్రతను భారీగా పెంచేసింది. మరో వైపు టీడీపీ అనుకూల మీడియాతో పాటు ఆ పార్టీ నాయకులు కూడా చంద్రబాబుని చంపేస్తారు అని ప్రచారం చేయడం మొదలెట్టారు. బాబుకు ప్రాణహాని ఉంది అన్న పాయింట్ ని కూడా సోషల్ మీడియాలో తెగ  వైరల్ చేశారు.

దాంతో వైసీపీ కార్నర్ అయింది. నిజానికి ఇటు వైపు కూడా దాడులు జరిగాయి. ఒక మహిళా ఎంపీ అశ్విని మీద టీడీపీ వారు దాడి చేశారు. కానీ వైసీపీ దూకుడుతో పాటు తప్పుడు స్ట్రాటజీల వల్లనే ఇలా జరిగింది అని ఆ పార్టీ వారు తలపట్టుకుంటున్నారు. ఇక అన్న క్యాంటీన్ ని ద్వంశం చేయడం వైసీపీ అరాచకానికి పరాకాష్ట అనే అంతా అంటున్నారు. ఎవరైనా అన్నం పెట్టే చేయిని అడ్డుకుంటారా అన్న ప్రశ్న వస్తే అధికార పార్టీ వద్ద జవాబు లేదు.

మొత్తానికి కుప్పంలో జనాలను కలసి తన వైపునకు తిప్పుకుందామని వెళ్ళిన బాబుకు వైసీపీ దూకుడు బాగా కలసివచ్చింది. బోలెడు సానుభూతిని ఆయన మూటకట్టుకున్నారు. అలాగే అధికార పార్టీ మీద కూడా వ్యతిరేకత కేవలం కుప్పంలోనే కాదు ఏపీలో కూడా పెంచగలిగారు. ఇవన్నీ ఇలా ఉంటే కుప్పంలో బాబుకు ధీటు అయిన అభ్యర్ధి అంటూ బీసీ నేత, ఎమ్మెల్సీ భరత్ ని వైసీపీ ఇప్పటిదాకా ఫోకస్ చేస్తూ వచ్చింది.

అటూ ఇటూ గొడవలు జరిగాయి. తమ పార్టీకి చెందిన ఎంపీపీ అశ్విని అయితే ఏడుస్తూ మీడియా ముందు గోడు పెట్టుకుంది. అయినా కుప్పం ఇంచార్జిగా ఉన్న భరత్ ఎక్కడా బయటకు రాలేదు. ఆయన అసలు ఈ మూడు రోజులూ ముఖం చూపించలేదు. దాంతో ఇపుడు వైసీపీలో అంతర్మధనం జరుగుతోంది. ఆయన్ని ముందు పెట్టుకుని వెళ్తే వచ్చే ఎన్నికల్లో సీన్ వేరేగా ఉంటుందా అన్న చర్చ కూడా మొదలైందిట. భరత్ బాబుకు సరిజోడు అయిన ప్రత్యర్ధేనా అన్న మాట కూడా వస్తోందిట.

దీంతో ఇపుడు వైసీపీ కొత్త ఎత్తుగడలకు కూడా దిగే అవకాశం ఉందని అంటున్నారు. కుప్పంలో బాబుని ఎదుర్కోవాలీ అంటే అన్ని రకాలుగా ధీటైన వారే రావాలీ అంటున్నారు. అగ్ర కులం అయినా ఫరవాలేదు బాబు తో ఢీ అంటే ఢీ అనాల్సిన వారే ఉండాలి అని అంటున్నారు. మరి పెద్దిరెడ్డి సోదరుడి కుమారుడి పేరు మరో మారు చర్చకు వస్తోంది. చూడాలి మరి వైసీపీ న్యూ స్ట్రాటజీ ఎలా ఉంటుందో. ఏది ఏమైనా మూడు రోజుల టూర్ లో మాత్రం బాబు వైసీపీ మీద గెలిచేశారు. ఇది పక్కా నిజం అని వైసీపీ వారే అంగీకరించే పరిస్థితి.
Tags:    

Similar News