తమిళ అమ్మాయిని పెళ్లి చేసుకుంటారా?.. మహిళ ప్రశ్నకు రాహుల్ సమాధానం ఇదే!
వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ.. భారత్ జోడో యాత్రకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. తమిళనాడులోని కన్యాకుమారిలోని తన యాత్రను మొదలుపెట్టిన రాహుల్ గాంధీ యాత్ర ఇప్పుడు ఆ రాష్ట్రంలో ముగిసింది. ప్రస్తుతం కేరళలోకి భారత్ జోడో యాత్ర ప్రవేశించింది.
నిరుద్యోగం, ధరల పెరుగుదలను నిరసిస్తూ రాహుల్ భారత్ జోడో యాత్రను చేపట్టిన సంగతి తెలిసిందే. తన పాదయాత్రలో భాగంగా రాహుల్ తమిళనాడులోని ప్రజలను కలుసుకుంటూ, వారి సమస్యలను వింటూ ముందుకు సాగారు. ఇందులో భాగంగా మహిళా ఉపాధి హామీ కూలీలతో రాహుల్ భేటీ అయ్యారు. అదేవిధంగా ఆసియాలోని ప్రథమ మహిళా బస్సు డ్రైవర్ అయిన 63 ఏళ్ల వసంతకుమారితో సంభాషించారు. మార్తాండమ్‌లోని పారిశుధ్య కార్మికులతో కూడా మాట్లాడారు. అలాగే కేరళ సరిహద్దు సమీపంలో, తమిళనాడు యాత్ర ముగింపులో రాహుల్ గాంధీ టీ-స్టాల్ యజమానితో సంభాషించి మంచీచెడ్డా ఆరా తీశారు.
అయితే ఉపాధి హామీ మహిళా కూలీలతో భేటీ సందర్భంగా రాహుల్ వారితో సరదాగా సంభాషించారు. వారి ఆదాయం, కుటుంబ స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో అందులోని ఓ మహిళ నుంచి రాహుల్ కు ఊహించని ప్రశ్న ఎదురైంది. మీరు తమిళనాడును ప్రేమిస్తారని మాకు తెలుసు.. ఈ నేపథ్యంలో తమిళ యువతితో మీకు వివాహం చేయడానికి మేం సిద్ధంగా ఉన్నాం.. మీరేమంటారు అంటూ రాహుల్ ను ఆ మహిళ ప్రశ్నించింది. దీంతో రాహుల్ గాంధీ ఆమె వంకచూసి నవ్వుతూ ఉండిపోయారు. రాహుల్ గాంధీకి 53 ఏళ్ల వయసు వచ్చినా ఇంకా పెళ్లి చేసుకోని విషయం తెలిసిందే.
రాహల్‌ను పెళ్లి విషయంపై ఓ మహిళ ప్రశ్నించిన విషయాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేష్ తన ట్విటర్ ఖాతా ద్వారా పంచుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సైతం జైరాం రమేష్ ట్విట్టర్‌లో షేర్ చేశారు.
కాగా ప్రస్తుతం తమిళనాడులో యాత్ర ముగించుకుని కేరళ రాష్ట్రంలో భారత్ జోడో యాత్ర సాగుతోంది. కేరళలో మొత్తం 18 రోజుల పాటు ఈ యాత్ర సాగుతుందని కాంగ్రెస్ నేతలు వెల్లడించారు. యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ స్థానిక ప్రజల సమస్యలను తెలుసుకుంటారని వివరించారు.