కొన్నిసార్లు అంతే. కొంతమందిని అవసరం నాయకుల్ని చేస్తుంది. తాజా పరిణామం చూస్తే ఈ మాట నిజమనిపించక మానదు. శోభ మృతితో ఆమె స్థానాన్ని భర్తీ చేయటానికి రాజకీయాల్లోకి వచ్చారు భూమా అఖిల ప్రియ. ఆ తర్వాతి కాలంలో భూమానాగిరెడ్డి మరణంతో భూమా కుటుంబానికి చెందిన బ్రహ్మానంద రెడ్డి రాజకీయాల్లోకి రాక తప్పలేదు. తక్కువ వ్యవధిలోనే బలమైన.. ప్రజాదరణ కలిగిన కుటుంబానికి చెందిన కుటుంబ పెద్దలు ఒకరి తర్వాత మరొకరు మరణించటానికి మించిన పెద్ద శిక్ష ఇంకొకటి ఉండదు.
అప్పటివరకూ అంతా తామై చూసుకున్న రాజకీయాన్ని.. వర్గాన్ని.. చూసుకోవటం.. వారి అవసరాల్ని తీర్చటం.. ప్రత్యర్థులకు ధీటుగా పావులు కదపటం అంత తేలికైన విషయం కాదు. ఇదంతా చేస్తూ.. తమపై వచ్చే విమర్శల్ని ఎదుర్కోవటం.. సవాళ్లను సమర్థవంతంగా డీల్ చేయటం సామాన్యమైన విషయం కాదు. అందునా కర్నూలు జిల్లా నంద్యాల.. ఆళ్లగడ్డ లాంటి ప్రాంతాల్లో రాజకీయం నడపటం పదునైన కత్తి మీద నడక లాంటిది.
ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లోనే ఉంది భూమా ఫ్యామిలీ. గడిచిన కొద్దికాలంగా తమ కుటుంబానికి.. తన తండ్రికి అత్యంత సన్నిహితుడైన వ్యక్తిపైనే ఫైట్ చేయాల్సిన చిత్రమైన పరిస్థితుల్లోకి వెళ్లిపోయారు భూమా అఖిలప్రియా.. ఆమె కుటుంబ సభ్యులు.
తాజాగా ఏవీ సుబ్బారెడ్డి నిర్వహిస్తున్న సైకిల్ యాత్రపై కొందరు దాడి చేయటం.. అది భూమా అనుచరులుగా ఆరోపించటం.. పార్టీలో తగ్గుతున్న క్రమశిక్షణపై ఆందోళన చెందుతున్న చంద్రబాబు అటు భూమా ఫ్యామిలీని.. ఇటు ఏవీ సుబ్బారెడ్డిని తన వద్దకు పిలిపించుకున్నారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న కీలక నేత పంచాయితీకి పిలిచిన సందర్భంలో మీడియాతో మాట్లాడటానికి అస్సలు ఇష్టపడరు. అందుకు భిన్నంగా మంత్రి అఖిలప్రియ చెల్లెలు భూమా మౌనిక మీడియాతో మాట్లాడటం ఒక ఎత్తు అయితే.. తమ ప్రత్యర్థిగా మారిన ఒకనాటి కుటుంబ స్నేహితుడు ఏవీ సుబ్బారెడ్డిపై విరుచుకుపడిన తీరు ఇప్పుడు అందరి దృష్టిని విపరీతంగా ఆకర్షించింది.
అఖిలప్రియ మాటలు.. ఆమె తీరు మొత్తం దివంగత శోభానాగిరెడ్డిని పోలి ఉంటే.. మౌనిక తీరు మాత్రం అచ్చు గుద్దినట్లుగా తన తండ్రి భూమానాగిరెడ్డి మాదిరి ఉండటం గమనార్హం. సుత్తి కొట్టకుండా సూటిగా మాట్లాడటం.. ఎలాంటి తొణుకు బెణుకు లేకుండా చెప్పాల్సింది చెప్పటమే కాదు.. అవసరమైతే వార్నింగ్ ఇచ్చేయటంతో నాగిరెడ్డి ఎలాంటి తెగువను ప్రదర్శిస్తారో అలాంటి తీరును ప్రదర్శించారని చెప్పాలి మౌనిక.
ముఖ్యమంత్రిపై తమకు నమ్మకం ఉంటుందని చెబుతూ.. తన తండ్రి మరణించిన సమయంలో తమ కుటుంబానికి బాబు పెద్ద దిక్కుగా ఉంటారని చెప్పారంటూ.. అదే విషయాన్ని పలుమార్లు ప్రస్తావించిన మౌనిక.. బాబు నుంచి ఎలాంటి స్పందన తాను ఆశిస్తున్నానన్న విషయాన్ని చెప్పకనే చెప్పేశారు. అంతేకాదు.. తన అక్క అఖిలప్రియను టచ్ చేయాలంటే ఎవరెవరిని దాటాలో తెలుసా? అంటూ చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇప్పటివరకూ అఖిలప్రియ సాఫ్ట్ నేచర్ ను చూసినోళ్లకు.. మౌనిక రూపంలో కనిపిస్తున్న యాంగ్రీ యంగ్ బర్డ్.. భూమా నాగిరెడ్డి అసలుసిసలు రాజకీయ వారసురాలిగా పలువురు అభిప్రాయపడటం చూస్తే.. నంద్యాల.. ఆళ్లగడ్డలకు భూమా కుటుంబం నుంచి ఫ్యూచర్ నాయకులు ఎవరన్న విషయంపై కాస్తంత క్లారిటీ వచ్చేసినట్లేనని చెప్పాలి.