ప్రపంచవ్యాప్తంగా అమెరికాకు సంబంధించిన ఎటువంటి సమాచారాన్నైనా శ్రద్ధగా వింటారు. ఈ తరుణంలో అమెరికా అధ్యక్షుడు ఎలాంటి వ్యాఖ్యలు చేసినా అందులో ఏం మర్మముందోనని పరిశీలిస్తారు. ఆయన చేసే ప్రతీ కామెంట్ చాలా ఇంపార్టెంట్ గా ఉంటుంది. ఈ నేపథ్యంలో యూఎస్ అధ్యక్షుడు జో బైడెన్ తన ఆరోగ్యం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు క్యాన్సర్ ఉందని అన్నాడు.
భూమ్మీద పెరుగుతున్న కర్బన ఉద్గారాల గురించి మాట్లాడుతున్న సందర్భంలో తనకు క్యాన్సర్ ఉందని తెలిపాడు. దీంతో యూఎస్ లోనే కాకుండా చాలా దేశాల్లో ఆయన వ్యాఖ్యలపై చర్చోప చర్చలు పెట్టారు. అయితే జో బైడెన్ చేసిన క్యాన్సర్ వ్యాఖ్యలపై వైట్ హౌస్ వివరణ ఇచ్చింది. ఆయన తనకు క్యాన్సర్ అన్న విషయాన్ని ఎందుకు బయటపెట్టారు..? అసలు ఆయనకు ఏ క్యాన్సర్ ఉంది..? అన్న చర్చ సాగుతోంది.
ప్రపంచ పెద్దన్నగా భావించే అమెరికాకు అధ్యక్ష స్థానంలో ఉన్నవారిపై దృష్టి బాగానే ఉంటుంది. ఈ తరుణంలో ఆయన ఆరోగ్యంపై కూడా చర్చ ఉంటుంది. అయితే తాజాగా జో బైడెన్ తనకు క్యాన్సర్ అంటూ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. యూఎస్ మసాచుసెట్స్ లోని సోమర్సెట్ వద్ద ఉన్న ఓ మూతపడిన బొగ్గు గనిని ఇటీల సందర్శించారు. వాతావరణ మార్పులపై ఉద్యమించేందుకు అవసరమైన కార్యవనిర్వాహక ఆదేశాలపై చర్చించేందుకు ఈ పర్యటన చేశారు. ఈ సందర్భంగా తనకు క్యాన్సర్ ఉంది వ్యాఖ్యలు చేశారు.
‘మేం చిన్నప్పుడు డెలావర్ లో ఉండేవాళ్లం. మేం నడవగలిగేవాళ్లమే అయినా మా అమ్మ ఎప్పుడు నడిచి వెళ్లివచ్చేది కాదు. కార్లో స్వయంగా వెళ్లేది. ఎందుకంటే అక్కడ చమురు శుద్ధి కర్మాగారాల నుంచి విడుదలయ్యే ఉద్గారాలే. అక్కడి నుంచి కారు వెళ్లే టప్పుడు కారు అద్దాలపై చమురు పడితే వైపర్లతో శుద్ధి చేయాల్సి వచ్చేది.
ఈ తరహా దారుణమైన వాతావరణంలో నేను పెరిగాను. దీంతో నాతో పాటు చాలా మంది క్యాన్సర్ బారిన పడ్డారు. అమెరికాలోకెల్లా డెలావర్ చాలాకాలంగా అత్యధిక క్యాన్సర్ పీడిత ప్రాంతంగా నిలిచింది’ అని బైడెన్ అన్నారు.
అయితే ఈ వ్యాఖ్యల్లో తాను క్యాన్సర్ బారిన పడ్డానన్న విషయం అర్థం రావడంతో బైడెన్ కు క్యాన్సర్ అని ప్రచారం జరిగింది. దీంతో ఆయన ఆరోగ్యంపై అధికారులు ఆరా తీశారు. కొందరు ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు కూడా చేశారు. పలు దేశాల్లో ఆయనపై చర్చలుక కూడా పెట్టారు. ఈ తరుణంలో వైట్ హౌస్ వెంటనే వివరణ ఇచ్చింది. బైడెన్ గత సంవత్సరం పదవీ బాధ్యతలు స్వీకరించడానికి ముందు తాను చేయించుకున్న చర్మ క్యాన్సర్ చికిత్స గురించి ఈ ప్రకటన చేశారని, ఆయనకు ఇతర క్యాన్సర్ కారకాలు లేవని స్పష్టత ఇచ్చింది.