కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి రోజుకో ఎదురు దెబ్బ తగులుతోంది. మొన్నటికి మొన్న రాజకీయంగా పెద్ద ఎదురు దెబ్బ తగలగా,,, తాజాగా ఆర్థికపరంగానే కాకుండా... కుటుంబ పరంగానే పెద్ద దెబ్బ పడినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. సోనియా గాంధీ కనుసన్నల్లో కొనసాగిన యూపీఏ పాలనలో ఆమె అల్లుడిగా బరిలోకి దిగిన రాబర్ట్ వాద్రా పెద్ద సంఖ్యలో కంపెనీలను నెలకొల్పారు. అంతేకాకుండా అప్పటిదాకా సింగిల్ కార్యకలాపం కూడా నమోదు చేయని సదరు కంపెనీల పేరిట ఆయన రాజస్థాన్ - హర్యాణా - ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశారు.
నాడు కేంద్ర ప్రభుత్వాన్ని తన కనుసైగలతో నియంత్రిస్తున్న సోనియా గాంధీకి స్వయానా అల్లుడు కావడంతో నాడు వాద్రా అక్రమాలను ఏ ఒక్కరు కూడా బయటపెట్టడానికి సాహసం చేయలేకపోయిన వైనం మనందరికీ తెలిసిందే. అయితే నిజాయతీకి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన సీనియర్ ఐఏఎస్ అధికారి అశోక్ ఖేమ్కా... వాద్రా భూ భండారాన్ని బయటపెట్టారు. నాడు హర్యాణాను పాలిస్తున్న భూపీందర్ హుడా సర్కారు... తమ అధినేత్రి అల్లుడి భాగోతాన్నే బయటపెడతావా? అంటూ ఖేమ్కాపై కత్తి గట్టింది. ఒక్క దెబ్బకు ప్రాధాన్యం లేని శాఖకు బదిలీ చేసేసింది. నాడు ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా పెను సంచలనమే రేపింది.
హర్యాణాలో వెలుగుచూసిన వాద్రా భూదాహం రాజస్థాన్ - యూపీ - పంజాబ్ లకు కూడా పాకిన వైనం ఆ తర్వాత చిన్నగా వెలుగులోకి వచ్చింది. ఈ కేసుపై ఓ పక్కసీబీఐ దర్యాప్తు సాగుతుండగానే... తాజాగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగేసింది. నేటి ఉదయం ఢిల్లీ, ఆ నగర పరిసరాల్లోని వాద్రా స్నేహితులు, వ్యాపార భాగస్వాములకు చెందిన ఇళ్లు, కార్యాలయాలపై ఏక కాలంలో దాడులు చేసింది. గంటల తరబడి కొనసాగిన ఈ సోదాల్లో వాద్రా భూ కుంభకోణాలకు సంబంధించిన కీలక పత్రాలు లభ్యమైనట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ పేపర్లనే ఆధారాలుగా చూపి దర్యాప్తును మరింత వేగవంతం చేసేందుకు ఈడీ అధికారులు కసరత్తు చేస్తున్నట్లు జాతీయ మీడియాలో ప్రత్యేక కథనాలు ప్రసారమవుతున్నాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/