అమెరికాలో ఎవరినీ ఉండనిచ్చేలా లేరు

Update: 2017-02-08 13:09 GMT
అమెరికా యానంపై అనేక కలలు కంటున్నవారికి ఇప్పటికీ అయోమయం వెంటాడుతోంది. ట్రంప్ పాలనతో అమెరికా వెళ్లడం కష్టమేనన్న భావన అన్ని దేశాల నుంచి వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం మరో షాకింగ్ నిర్ణయాన్ని అమలు చేసేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నట్లుగా చెబుతున్నారు. గ్రీన్ కార్డులను సగానికి తగ్గించాలన్న ప్రతిపాదనలో రిపబ్లికన్ పార్టీకి చెందిన ఇద్దరు సెనేటర్లు బిల్లును ప్రవేశపెట్టడంతో ప్రపంచమంతా దీనిపై ఏం జరగబోతోందా అని ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
    
రిపబ్లికన్‌ సెనేటర్‌ టామ్‌ కాటన్‌ - డెమోక్రటిక్‌ పార్టీకి చెందిన సెనేటర్‌ డేవిడ్‌ పెర్‌ డ్యూ అమెరికాలో ఉండే వలసదారులను సగానికి తగ్గించాలని ప్రతిపాదిస్తూ బిల్లు రూపొందించారు.  అమెరికాలో స్థిరనివాసం కోసం అందజేస్తున్న గ్రీన్‌ కార్డులను 10లక్షల నుంచి 5 లక్షలకు తగ్గించాలని అందులో  ప్రతిపాదించారు. ఇప్పుడు ఈ బిల్లు కనుక ఆమోదం పొందితే  అమెరికాలో ఉంటున్న వలసదారులకు సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది.  ప్రస్తుతం అమెరికాలో భారతీయులు గ్రీన్‌ కార్డు పొందడానికి వేచి ఉండాల్సిన సమయం సుమారు 10 ఏళ్ల నుంచి 35ఏళ్ల దాకా ఉండగా.. ఈ బిల్లు చట్టమైతే భారతీయులు గ్రీన్‌ కార్డు కోసం ఇంకా ఎక్కువ కాలం వెయిట్ చేయాల్సి ఉంటుంది.
    
ఈ బిల్లు చట్టమైతే భారతీయులు గ్రీన్‌ కార్డు కోసం వేచి ఉండాల్సిన సమయం కూడా పెరిగే అవకాశం ఉంటుంది.  . ప్రస్తుతం అమెరికాలో ప్రతీఏడాది గ్రీన్‌ కార్డు లేదా లీగర్ పర్మినెంట్ రెసిడెన్సీ కార్డులను జారీ చేస్తున్నారు. ఈ బిల్లు ఆమోదం పొందితే ప్రస్తుతం ఉన్న విధానాలన్నీ మారిపోతాయి. అయితే.. హెచ్1బీ వీసాలకు ఈ బిల్లుకు మాత్రం ఎలాంటి సంబంధం లేదని సదరు సెనేటర్లు చెబుతున్నారు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News