తన నియోజకవర్గంలో పనులు జరగకపోవడంపై ప్రతిపక్ష ఎమ్మెల్యే ఒకరు వినూత్న నిరసన తెలిపారు. బీహార్‌లోని బీజేపీ పార్టీకి చెందిన బినయ్ బిహారీ అర్థనగ్నంగా అసెంబ్లీకి వచ్చారు. కేవలం బనియన్, షార్ట్ వేసుకున్న ఆ ఎమ్మెల్యే అసెంబ్లీ ముందు బైఠాయించాడు. తన అసెంబ్లీ నియోజకవర్గంలో రోడ్డు నిర్మాణం ఆలస్యంగా జరుగుతోందని ఆరోపిస్తూ ఎమ్మెల్యే బినయ్ ఈ రకంగా నిరసన వ్యక్తం చేశారు. భారత ప్రభుత్వం కోసం కుర్తాను, బీహార్ అసెంబ్లీ కోసం పైజామాను గిఫ్ట్ గా ఇస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఎమ్మెల్యే వినూత్న ప్రదర్శన పెద్ద ఎత్తున వార్తల్లో నిలవడంతో అధికారులు ఈ రోడ్ల విషయంపై చర్చించినట్లు సమాచారం.
ఇదిలాఉండగా...సమాజ్ వాదీ పార్టీ ఎంపీ నరేష్ అగర్వాల్ చేసిన వ్యాఖ్యలు రాజ్యసభను కుదిపేశాయి. ఈ సర్కారీ దళారీలు సభను జరగనీయరు అంటూ అధికార పక్షంవైపు చూపిస్తూ నరేష్ అగర్వాల్ సభలో వ్యాఖ్యానించారు. దీంతో సభలో గందరగోళం మొదలైంది. అగర్వాల్ కామెంట్స్‌పై అధికార పక్ష నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. ఇలాంటి భాష వాడటం ఏమాత్రం సమంజసనీయం కాదని, ఇది చాలా తప్పని కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వి అన్నారు. ఈ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించడమే కాదు.. ఆ సభ్యుడు క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. దీంతో సభలో గొడవ మొదలవడంతో చైర్మన్ సభను రేపటికి వాయిదా వేశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/