భార‌త్‌పై `బ‌యోవార్` జ‌రిగిందా? కొత్త స్ట్రెయిన్ అదేనా?

Update: 2021-05-06 01:30 GMT
ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా క‌రోనా కేసులు పెరిగిపోతున్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో 3780 మంది క‌రోనా కార‌ణంగా మృతి చెందారు. అదేస‌మ‌యంలో పాజిటివ్ కేసులు దేశ‌వ్యాప్తంగా 3,82,315 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యా యి. దీంతో అస‌లు దేశం మొత్తం క‌రోనా గుప్పిట్లోకి జారిపోయింద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. నిజానికి క‌రోనా.. తీవ్ర‌త ఈ రేంజ్‌లో ఉంటుంద‌ని కానీ.. ఇలా ప్రాణాలు పోతాయ‌ని కానీ.. ఏ ఒక్క‌రూ అనుకోలేదు. ఈ నేప‌థ్యంలో దీనివెనుక ఏదైనా కుట్ర జ‌రిగిందా?  కేవ‌లం రెండు వారాల వ్య‌వ‌ధిలోనే దేశం మొత్తాన్ని క‌రోనా ఇలా చేట్టేయ‌డం వెనుక‌.. బ‌యోవార్ ఏదైనా జ‌రిగిందా? అనే చ‌ర్చ జోరుగా సాగుతోంది.

దీనికి సంబంధించి ఇప్ప‌టికే నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. బ‌యోవారం జ‌ర‌గ‌లేదు.. అని చెప్ప‌డానికి ఎలాంటి ఆధారాలు క‌నిపించ‌డం లేద‌ని అంటున్నారు. అయితే.. దీనికి ప్ర‌జ‌లు, ప్ర‌భుత్వాల నిర్ల‌క్ష్యం కూడా ఉంద‌ని.. అంటున్నారు. నిజానికి డిసెంబ‌రు నాటికి దేశంలో క‌రోనా తీవ్ర‌త తగ్గుముఖం ప‌ట్టింది. ఈ క్ర‌మంలో మ‌రికొన్ని నెల‌ల పాటు ఇదే జాగ్ర‌త్త‌లు తీసుకుంటే.. క‌రోనా పోతుంద‌నే సూచ‌న‌లు నిపుణులు చెప్పారు. ప్ర‌స్తుతం ఇది ప‌రివ‌ర్త‌నం(మ్యూటేష‌న్‌) చెందే ద‌శ‌లో ఉంద‌ని.. ఈ స‌మ‌యంలో ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోక పోతే.. ఇబ్బందేన‌ని.. ఎయిమ్స్ కు చెందిన నిపుణులు.. కొంద‌రు పీఎం కు లేఖ‌లు కూడా రాశారు.

అయితే.. ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల నేప‌థ్యంలో మోడీ వీరి సూచ‌న‌ల‌ను ప‌ట్టించుకోలేదు. అంతేకాదు.. ఫిబ్ర‌వ‌రి నాటికి దేశీయంగా త‌యారైన వ్యాక్సిన్‌ను మ‌రింత ఉత్ప‌త్తి చేసేందుకు బ‌డ్జెట్‌లో 36 వేల కోట్ల రూపాయ‌లు కేటాయించినా.. వ్యాక్సిన్ త‌యారీ దారుల‌కు, కంపెనీల‌కు ఈ నిధుల‌ను మ‌ళ్లించ‌క‌పోగా.. ఎన్నిక‌ల‌కు సై అన్నారు. కొద్దిపాటి వ్యాక్సిన్ దేశ‌ప్ర‌జ‌ల‌కు ఇచ్చి.. ఇత‌ర దేశాల‌కు ఎగుమ‌తులు చేసి.. అంత‌ర్జాతీయ మీడియా మెచ్చ‌కోళ్ల‌కోస త‌హ‌త‌హ‌లాడార‌నే వాద‌న ఉంది.ఇక‌, దేశంలో ప్ర‌భుత్వాలే నిర్ల‌క్ష్యంగా ఉన్నందున మాకెందుకు అనుకున్నారో.. ఏమో.. జ‌నాలు కూడా విచ్చ‌ల‌విడిగా సంచ‌రించారు.

ఫ‌లితంగా క‌రోనా మ్యూటేష‌న్ జ‌రిగింద‌నే వాద‌న ఉంది. కానీ, ఇప్పుడు మ‌రో వాద‌న తెర‌మీదికి వ‌చ్చింది. ఎంత ఉత్ప‌రివ‌ర్త‌నం చెందినా.. ఈ రేంజ్‌లో మాత్రం ఉండే అవ‌కాశం లేద‌ని.. కేవ‌లం వారాల వ్య‌వ‌ధిలో నే ఇది ఇంత తీవ్రంగా వ్యాపించ‌డం.. వేల సంఖ్య‌లో జ‌నాలు మ‌ర‌ణించ‌డం వెన‌క ఖ‌చ్చితంగా బ‌యోవార్ వంటిది ఏదైనా జ‌రిగిందా? అనే సందేహం స‌ర్వ‌త్రా వ్య‌క్త‌మ‌వుతోంది. ప్ర‌స్తుతం ప్ర‌భుత్వాలు సైతం ఇంట్లో ఉన్నాకూడా మాస్కులు ధ‌రించాల‌ని చెబుతున్న విష‌యాన్ని ప్ర‌ధానంగా శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు.

ఇలా ప్ర‌పంచ దేశాల్లో ఎక్క‌డా జ‌ర‌గ‌లేద‌ని.. చాలా దేశాల్లో ఇప్పుడు మాస్కుల నిబంధ‌న‌ల‌ను కూడా స‌డలిస్తున్నార‌ని.. కానీ, భార‌త్‌లో మాత్రం మ‌రింత తీవ్రంగా క‌రోనా వ్యాప్తి పెరిగిపోయింద‌ని.. సో.. దీని వెనుక ఖ‌చ్చితంగా ఏదో జ‌రిగింద‌నే వాద‌న‌లో ప‌స‌లేక‌పోలేద‌ని చెబుతున్నారు. గాలిలో కూడా క‌రోనా వ్యాపించ‌డం అనేది ప్ర‌పంచంలో ఇప్ప‌టి వ‌ర‌కు వెలుగు చూడ‌లేదని.. ఇటీవ‌ల శ్రీలంక‌లో ఇలాంటి ప‌రిణామం చోటు చేసుకున్నా.. అది స‌రికాద‌ని ప్ర‌పంచం మొత్తం ఖండించినా.. భార‌త్ విష‌యానికి వ‌చ్చే స‌రికి మాత్రం ఎవ‌రూ ఖండించ‌ని విష‌యాన్ని కూడా ప్ర‌స్తావిస్తున్నారు. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో బ‌యో వార్ వంటి వాటికి అవకాశం లేక‌పోలేద‌ని అంటున్నారు. ప్ర‌స్తుతం అన్ని వ‌ర్గాల్లోనూ ఇదే చ‌ర్చ సాగుతుండ‌డం గ‌మ‌నార్హం.
Tags:    

Similar News