త్రిపురలో పాతికేళ్లుగా అధికారంలో పాతుకుపోయిన లెఫ్ట్ పార్టీలను గద్దె దించ్చి బీజేపీ జెండా ఎగురవేయనుంది. అక్కడ బీజేపీ - వామపక్షాల మధ్య పోటీ హోరాహోరీగా ఉన్నప్పటికీ అత్యధిక స్థానాల్లో లీడింగ్ మాత్రం బీజేపీదే. కమల కూటమి స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకెళ్లోంది. మేఘాలయాలో మాత్రం భారతీయ జనతాపార్టీ పార్టీ వెనుకబడిపోయింది. నాగాలాండ్‌లోనూ భాజపా కూటమి అయిన ఎన్ డీపీపీ ముందంజలో ఉంది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు అందిన ఫలితాల ఆధారంగా చూస్తే త్రిపురలో బీజేపీ 7 స్థానాల్లో విజయం సాధించి - 33 స్థానాల్లో ముందంజలో ఉంది. వామపక్షాలు 2 స్థానాల్లో గెలువగా 16 సీట్లలో ఆదిక్యతను కనబరస్తున్నాయి. దీనిని బట్టి త్రిపురలో ఎర్రదళం కోటలో కమలదళం జెండా ఎగరడం ఖాయమనిపిస్తున్నది.
అయితే ఈ ఎన్నికల్లో గెలుపు నేపథ్యంలో జిమ్ ఇన్ స్ట్రక్టర్ గా పనిచేసి బీజేపీ గెలుపుతీరానికి చేర్చిన నాయకుడిని సీఎం చేయనుంది. త్రిపుర సీఎంగా బిప్ లబ్ కుమార్ దేవ్ ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆయన వయసు 49 ఏళ్లు. కుమార్ దేవ్.. గతంలో ఆర్ ఎస్ ఎస్ వాలంటీర్ గా పనిచేశారు. త్రిపుర రాష్ట్ర బీజేపీ చీఫ్ గా ఉన్నారాయన. ఓ రాష్ర్టానికి చీఫ్‌గా ఉన్న అత్యంత పిన్నవయస్కుడైన బీజేపీ నేత ఆయనే. 15 ఏళ్ల క్రితం కుమార్ దేవ్.. ఢిల్లీలో జిమ్ ఇన్ స్ట్రక్టర్ గా పనిచేశారు.