తెలుగు రాష్ట్రాల‌కు మ‌రోసారి దెబ్బేసిన కేంద్రం!

Update: 2018-07-10 05:20 GMT
ఏదైనా పోటీ జ‌రుగుతున్న‌ప్పుడు టాప్ 20 అంటే.. ఉన్న వాటిల్లో ఉత్త‌మ‌మైన ఇర‌వైను ఎంపిక చేయ‌టం జ‌రుగుతుంది. అందుకు భిన్నంగా ఆరింటికి ప‌రిమితం చేయ‌టం ఎక్క‌డా క‌నిపించ‌దు. కానీ.. ఘ‌న‌మైన కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా అదే రీతిలో వ్య‌వ‌హ‌రించి అంద‌రికి షాకిచ్చింది. మ‌రి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల‌పై త‌న‌కున్న అక్క‌సును ప్ర‌ద‌ర్శించింద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

ప్ర‌పంచ స్థాయిలో వ‌ర్సిటీల‌కు ర్యాంకింగ్ లో ముందు ఉండేలా ఎంపిక ప్ర‌క్రియ‌ను కేంద్రం పూర్తి చేసింది. ప్ర‌పంచంలో అత్యుత్త‌మ వ‌ర్సిటీల ర్యాంకింగ్ కోసం దేశ‌వ్యాప్తంగా వ‌డ‌బోత పోసి టాప్ 20 నిర్ణ‌యిస్తామ‌ని కేంద్రం ప్ర‌క‌టించింది. అయితే.. టాప్ 20 కాస్తా టాప్ 6కు ప‌రిమితం చేయ‌టం ఆశ్చ‌ర్య‌క‌రంగా మారింది.

టాప్ 20 కాస్తా.. టాప్ 6గా మార‌టంతో తెలుగు రాష్ట్రాల‌కు దెబ్బ ప‌డింది. దేశంలో టాప్ 20 బెస్ట్ వ‌ర్సిటీ లెక్క తీసిన‌ప్పుడు తెలుగు రాష్ట్రాల‌కు చెందిన వ‌ర్సిటీలు త‌ప్ప‌క ఉంటాయి. కానీ.. ఆ ప‌రిమితిని కుదించటంలో జాబితాలో తెలుగు రాష్ట్రాల్లోని విశ్వ‌విద్యాల‌యాలు లేకుండా పోయాయి.

ప్ర‌పంచ స్థాయిలో టాప్ 100లో మ‌న విశ్వ‌విద్యాల‌యాలు చోటు ద‌క్కించుకునేందుకు వీలుగా దేశంలోని వ‌ర్సిటీల‌ను త‌యారు చేయాల‌ని రెండేళ్ల క్రితం కేంద్రం సంక‌ల్పం తీసుకుంది. ఇందులో భాగంగా దేశంలో అత్యుత్త‌మ వ‌ర్సిటీలుగా ఎంపికైన వాటికి కేంద్రం ఐదేళ్ల వ్య‌వ‌ధిలో మౌలిక స‌దుపాయాలు మొద‌లుకొని ఇత‌ర అవ‌స‌రాల కోసం రూ.1000 కోట్లు ఖ‌ర్చు చేయాల‌ని కేంద్ర మాన‌వ వ‌న‌రుల మంత్రిత్వ శాఖ భావించింది.

ఇందులో భాగంగా దేశ వ్యాప్తంగా ఉత్త‌మ వ‌ర్సిటీలకు ర్యాంకులు ఇచ్చే ప్ర‌క్రియ‌ను స్టార్ట్ చేశారు. ఈ పోటీలో పాల్గొనేందుకు వివిధ రాష్ట్రాల్లోని వ‌ర్సిటీలు ద‌ర‌ఖాస్తు చేసుకున్నాయి. ఎన్ ఐఆర్ ఎఫ్ ర్యాంకుల్లో 50 లోపు ఉన్న‌వి ఈ పోటీకి ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌న్న నిబంధ‌న పెట్టినా.. చివ‌ర‌కు 114 అప్లికేషన్లు వ‌చ్చాయి. మొత్తం టాప్ 20 ఎంపిక చేయాల్సిన స్థానే దాన్ని టాప్ 6కు కుదించ‌టంతో రెండు తెలుగు రాష్ట్రాల‌కు చెందిన వ‌ర్సిటీ పేర్లు గ‌ల్లంత‌య్యాయి. టాప్ 20కాస్తా టాప్ 6కు ఎందుకు ప‌రిమితం చేశార‌న్న విష‌యంపై కేంద్రం క్లారిటీ ఇవ్వ‌లేదు. ఇదిలా ఉంటే.. ఇదంతా తెలుగు రాష్ట్రాల్లోని వ‌ర్సిటీల‌ను దెబ్బ తీయ‌టానికే అన్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

ఇదిలా ఉంటే.. టాప్ 6కు ఎంపికైన విద్యా సంస్థ‌ల్లో ప్ర‌భుత్వ.. ప్రైవేటు సంస్థ‌లు ఉండ‌టం గ‌మ‌నార్హం. టాప్ 6 బెస్ట్ వ‌ర్సిటీలు చూస్తే..

1. ఐఐటీ బొంబాయి
2. ఐఐటీ ఢిల్లీ
3. ఇండియ‌న్ ఇన్‌ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్
4. బిట్స్ పిలానీ
5. మ‌ణిపాల్ వ‌ర్సిటీ
6. జియో ఇన్ స్టిట్యూట్ (రిల‌య‌న్స్ ఫౌండేష‌న్‌)
Tags:    

Similar News