పాపం! పశ్చిమ బెంగాల్ బీజేపీ అభ్యర్థి భారతీఘోష్ ఏడ్చేశారు. దేశవ్యాప్తంగా ఆదివారం ఆరో విడత ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఘటాల్ లోక్ సభ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్న ఆమె తన ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం పోలింగ్ సరళిని తెలుసుకునేందుకు ఓ పోలింగ్ కేంద్రానికి వెళ్లారు. అంతే.. తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు ఆమెను చుట్టుముట్టి వ్యతిరేకంగా నినాదాలు చేశారట.
వారి నుంచి తప్పించుకుని మరో పోలింగ్ కేంద్రానికి వెళ్తే అక్కడా అదే పరిస్థితి ఎదురైందట. స్థానిక మహిళలు కొందరు ఆమె వాహనాన్ని చుట్టుముట్టి దాడి చేశారట. అంతే-దుఃఖాన్ని ఆపుకోలేక భారతీఘోష్ బావురుమన్నారు. తనపై దాడికి పాల్పడింది టీఎంసీ కార్యకర్తలేనని ఆమె ఆరోపించారు. తనపై దాడి జరిగిందన్న బాధలో ఉండగానే భారతీఘోష్ కు మరో చేదు అనుభవం ఎదురైంది. పోలింగ్ కేంద్రంలోకి వెళ్లిన ఆమె తన ఫోన్ తో వీడియో తీశారంటూ ఎన్నికల అధికారులు ఆమెకు వివరణ ఇవ్వాలని ఆదేశించింది.