అంకెల నిజం.. సౌత్ లో ఇర‌గ‌దీసిన బీజేపీ!

Update: 2019-05-26 08:15 GMT
ఊరుకోండి మీరు.. మ‌రీనూ అనేస్తారు కానీ ఇది నిజం.  దేశ వ్యాప్తంగా ఊహించ‌ని విధంగా భారీగా సీట్లు కొల్ల‌గొట్టిన బీజేపీ ద‌క్షిణాదిన త‌న ప్ర‌భావాన్ని చూపించ‌లేద‌న్న మాట‌ను ప‌లువురు చెబుతుంటారు. అయితే.. ఈసారి అందుకు భిన్న‌మైన ప‌రిస్థితి నెల‌కొంది. హిందీ బెల్ట్ తో పాటు.. ఉత్త‌రాదిన‌.. ఈశాన్యాన బీజేపీ అద్భుత ఫ‌లితాల్ని సాధించింది.

ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమంటే.. ద‌క్షిణాదిన ఉన్న ఏడు రాష్ట్రాల్లోనూ బీజేపీ గౌర‌వ‌ప్ర‌ద‌మైన సీట్ల‌ను సాధించింది. న‌మ్మ‌లేని నిజం ఏమిటంటే.. ద‌క్షిణాది రాష్ట్రాల్లో బీజేపీకి వ‌చ్చిన‌న్ని సీట్లు మ‌రే జాతీయ‌.. ప్రాంతీయ పార్టీల‌కు రాలేదు. అదెలా అంటే.. క‌న్న‌డ ప్ర‌జ‌ల క్రెడిట్ గా చెప్పాలి.

ద‌క్షిణాదిన అత్య‌ధిక సీట్ల‌లో గెలిచిన పార్టీగా బీజేపీ మొద‌టిస్థానంలో నిలిస్తే.. కాంగ్రెస్ త‌ర్వాతి స్థానంలో.. డీఎంకే మూడోస్థానంలో.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాలుగో స్థానంలో నిలిచింది. టీఆర్ ఎస్ ఐదో స్థానంలో నిలిచిన వైనం తాజాగా చూస్తే అర్థ‌మ‌వుతుంది.

బీజేపీకి వ‌చ్చిన 29 సీట్ల‌లో క‌ర్ణాట‌క‌లో ఆ పార్టీ అత్య‌ధిక సీట్ల‌ను సొంతం చేసుకుంది. క‌ర్ణాట‌క‌లోని 28 ఎంపీ స్థానాల్లో బీజేపీ మిత్ర‌ప‌క్షాల‌కు 25 స్థానాల్ని సొంతం చేసుకుంది. తెలంగాణ‌లో ఆ పార్టీ నాలుగు స్థానాల్ని సొంతం చేసుకోవ‌టంతో.. ద‌క్షిణాదిన బీజేపీ అత్య‌ధిక సీట్లు సాధించిన పార్టీగా అత‌రించింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

దక్షిణాదిన ఎవ‌రికి ఎన్ని సీట్లు అంటే..

బీజేపీ                 29
కాంగ్రెస్               27
డీఎంకే                23
వైఎస్సార్ సీపీ       22
టీఆర్ఎస్              9
లెఫ్ట్ పార్టీలు           4
టీడీపీ                  3
జేడీఎస్                1


Tags:    

Similar News