నలుగురు మనుషులు ఒకచోట చేరితే ఒకే విషయంపై భిన్నాభిప్రాయాలు వెలిబుచ్చటం సహజం. అదే ఓ పార్టీలోని నేతలపై మరో పార్టీపైన కూడా ఇన్ని అభిప్రాయాలుంటే. ఇపుడిదే బీజేపీలో పెద్ద సమస్యగా మారింది. బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబునాయుడు తెగ ప్రయత్నం చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. సరే చివరకు ఏమవుతుంది అనేది వేరే విషయం. అయితే టీడీపీతో పొత్తు పెట్టుకునే విషయంలో బీజేపీ నేతల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నట్లు సమాచారం. ఈ అభిప్రాయాలు కూడా మూడు రకాలుగా ఉంటున్నాయట. ఇదే అసలు సమస్యగా మారిపోయింది.
ఉదాహరణకు తిరుపతి లోక్ సభ ఉపఎన్నిక అంశమే కేంద్రంగా తీసుకుందాం. తిరుపతిలో మిత్రపక్షం జేనసేన సహకారంతో బీజేపీయే పోటీ చేస్తుందని రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. ఇదే సమయంలో తెలుగుదేశంపార్టీ తరపున ఎవరు పోటీ చేయరనే ప్రచారం జరిగింది తాము పోటీలో ఉండకుండా టీడీపీ కూడా బీజేపీ అభ్యర్దికే మద్దతిస్తుందనే ప్రచారం జరుగుతున్న విషయం కూడా తెలిసిందే. అయితే అనూహ్యంగా టీడీపీ తరపున పనబాక లక్ష్మీ మళ్ళీ పోటీ చేస్తుందని చంద్రబాబునాయుడు ప్రకటించేశారు. కాబట్టి మిగిలిన పార్టీల అభ్యర్ధులెవరో తేలాల్సుంది.
బేజేపీలోని కొందరు నేతలు మళ్ళీ టీడీపీతో నేరుగానే పొత్తు పెట్టుకోవాలని వాదిస్తున్నారట. బీజేపీ సొంతంగా పోటీ చేసి అసెంబ్లీలు కానీ పార్లమెంటు స్ధానాలు కానీ గెలుచుకునేంత బలం లేదన్నది వీళ్ళ వాదన. కాబట్టి ఏదో ఓ గట్టిపార్టీతో పొత్తు పెట్టుకుంటేనే నాలుగు నియోజకవర్గాల్లో గెలుస్తామనే వాదన వినిపిస్తున్నారు. ఇక రెండోవర్గమేమో పార్టీ ఎదగాలంటే ఓడినా, గెలిచినా టీడీపీతో పొత్తు లేకుండానే సొంతంగానే పోటీ చేయాలని గట్టిగా వాదిస్తోంది.
చివరగా మూడో వర్గమేమో అవసరానికి లోపాయికారీగా టీడీపీ మద్దతు తీసుకున్నా బహిరంగంగా మాత్రం పొత్తుండకూడదని వాదిస్తోందట. తమ వాదనకు మద్దతుగా తెలంగాణాలోని దుబ్బాక ఉపఎన్నికలో గెలుపును ఉదాహరణగా చెబుతున్నారట. దుబ్బాకలో గెలిచేంత సీన్ బీజేపీ లేకపోయినా అనేక అంశాలు కలిసి రావటంతో కమలంపార్టీ గిలిచింది. కలిసొచ్చిన అంశాల్లో బీజేపీకి అనుకూలంగా టీడీపీ సైలెంట్ ఓటింగ్ కూడా ఉందని కొందరు నేతలు చెబుతున్నారట.
అంటే టీడీపీతో పొత్తు విషయంలో ఒకే పార్టీలోని నేతల్లో మూడు రకాల అభిప్రాయాలు చక్కర్లు కొడుతున్నాయన్నది అర్ధమవుతోంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కారణం ఏదైనా కానీండి బీజేపీ నేతలపై ఆరోపణలు, విమర్శలు చేయవద్దని చంద్రబాబు దగ్గర నుండి పార్లమెంటు నియోజకవర్గాల అధ్యక్షులకు డైరెక్టుగా ఆదేశాలున్నాయట. ఇదే సమయంలో మళ్ళీ టీడీపీతో పొత్తన్నదే ఉండదని బల్లగుద్ది సోమువీర్రాజు, రాజ్యసభ ఎంపి జీవిఎల్ నరసింహారావు లాంటి వాళ్ళు బహిరంగంగానే చెబుతున్నారు.
నిజానికి టీడీపీతో పొత్తు పెట్టుకోవాలా ? వద్దా ? అన్నది వీళ్ళ స్ధాయిలో నిర్ణయం జరిగేది కాదని అందరికీ తెలిసిందే. ప్రధానమంత్రి నరేంద్రమోడి, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్ధాయిలో మాత్రమే పొత్తులు డిసైడ్ అవుతాయని అందరికీ తెలిసిందే. రేపటి రాజకీయ పరిస్దితుల్లో చంద్రబాబుతో పొత్తు పెట్టుకుంటేనే ఉపయోగం ఉంటుందని మోడి అనుకుంటే వెంటనే పొత్తు ఖరారైపోతోంది. ఇపుడు ఏపిలో రెండు పార్టీల పరిస్ధితి దాదాపు ఒకేలాగుందనటంలో సందేహంలేదు. టీడీపీకి 23 మంది ఎంఎల్ఏలున్నా ఒకటే, బీజేపీకి ఒక్క ఎంఎల్ఏ లేకపోయినా ఒకటే.