ఇంతకీ కేసీఆర్ పదవి ఇంకెన్నాళ్లు...?

Update: 2017-04-19 11:39 GMT
మరో 20 ఏళ్ల వరకు కేసీఆరే సీఎం అని ఇటీవలే హరీశ్ రావు చెప్పారు. ఆయనలా చెప్పిన కొన్నాళ్లకు కేటీఆర్ మాట్లాడుతూ మరో పదేళ్ల వరకు కేసీఆరే సీఎంగా ఉంటారని చెప్పారు. ఇద్దరి లెక్కల్లో ఎందుకీ తేడా వచ్చింది.. పదేళ్లు అంటే రెండు టెర్ముల పాలన. అంటే ఒకవేళ టీఆరెస్ మళ్లీ అధికారంలోకి వచ్చినా కూడా పదేళ్ల తరువాత కేటీఆర్ తండ్రి నుంచి అధికారం లాక్కుంటాడా అని బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.
    
బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణసాగరరావు దీనిపై మాట్లాడుతూ.. టీఆరెస్ నేతల ప్రకటనలు చూస్తుంటే వారి అభద్రతాభావం అర్థమవుతోందని అన్నారు. మళ్లీ గెలుస్తామో లేదో అన్న  భయం.. ఆత్మవిశ్వాసలోపం.. పదవులపై ఆశ.. ఎటు నుంచి ఎలాంటి ముప్పు వస్తుందో అన్న భయంతోనే వారలా మాట్లాడుతున్నారని ఆయన చెప్పుకొచ్చారు.  టీఆరెస్ లో వారసత్వ పోరు తప్పదన్నట్లుగా ఆయన పరోక్ష వ్యాఖ్యలు చేశారు.
    
అయితే... పదేళ్లు అని ఒకరు ఇరవయ్యేళ్లు అని ఇంకొకరు లెక్కలేసుకున్నా అసలు అధికారం ఇవ్వాలో వద్దో అని డిసైడ్ చేసేది ప్రజలని... వాళ్ల మనసు గెల్చుకోకపోతే ఎన్నికల్లో గెలవలేరని చెప్పారు. అధికారంలోకి వచ్చి మూడేళ్లవుతున్నా కేసీఆర్ ఏమీ చేయలేదని.. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోయారని అన్నారు. మొన్నటి ఎన్నికల్లో వచ్చిన సీట్లలో సగం కూడా రావన్న భయంతోనే వారంతా ఇలా మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News