బీజేపీ ఎన్నికల గుర్తు కమలం. పువ్వే కదా అని సున్నితంగా ఉంటుందని చేరదీస్తే బరువు మోతే అని పాత మిత్రులు చెబుతూంటారు. బీజేపీకి దేశమంతా ఘన విజయాలు దక్కినా దక్షిణాదిన అందునా ఏపీలో మాత్రం అసలు ఉనికి పోరాటమే ఈ రోజు వరకూ చేస్తూ వస్తోంది. సొంతంగా పోటీ చేస్తే 1998లో ఏకంగా పద్దెనిమిది శాతం ఓట్లు నాలుగు ఎంపీ సీట్లు వచ్చాయని అప్పటి విజయాన్ని బీజేపీ గొప్పగా ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటుంది.
కానీ రెండున్నర దశాబ్దాల నాటి రాజకీయ పరిస్థితులు వేరు. ఈ రోజు వేరు. ఇంకా గట్టిగా చెప్పాలీ అంటే బీజేపీ బలం అంతా గతమైంది. వర్తమానం కడు బరువుగా తోస్తోంది. 2004లో టీడీపీతో కలసి పొత్తు పెట్టుకుని భంగపడింది. 2009 నాటికి ఉమ్మడి ఏపీలో ఒంటరిగా పోటీ చేసి అభాసుపాలు అయింది.
ఇక 2014 నాటికి మోడీ క్రేజ్ ని చూపించి చంద్రబాబుతో జతకట్టి ఏపీలో రెండు ఎంపీ, నాలుగు ఎమ్మెల్యే సీట్లు తెచ్చుకుంది. ఇక 2019 నాటికి మళ్లీ ఒంటరి పోరాటమే ప్రాప్తించింది. దాంతో బీజేపీ ఓట్ల శాతం నోటా కంటే కూడా దారుణంగా పడిపోయింది. అందులోనూ కాస్తా సంబరం ఏంటి అంటే సాటి జాతీయ పార్టీ కాంగ్రెస్ కంటే కాస్త మెరుగుగా ఉన్నామనే.
ఇక 2020 నాటికి స్ట్రాటజీ మార్చిన బీజేపీ జనసేనతో జత కట్టింది. పవన్ కి ఉన్న సినీ గ్లామర్, ఆయన సామాజిక వర్గం ఓట్లూ అన్నీ కలసి ఏపీలో గణనీయమైన ఓటు బ్యాంక్ ని క్రియేట్ చేస్తాయని బీజేపీ నమ్ముతోంది. అయితే ఇపుడు బీజేపీకి కొత్త గుబులు పట్టుకుంది. అదెలా అంటే తమ మిత్రుడు పవన్ కళ్యాణ్ణి ఎక్కడ టీడీపీ హైజాక్ చేస్తుందో అన్నదే ఆ ఆందోళన.
పవన్ కనుక అలా జారిపోతే మాత్రం ఏపీలో బీజేపీకి మళ్ళీ గొప్ప చిక్కు వచ్చిపడడం ఖాయం. ఇంకో వైపు చూస్తే నిన్న పవన్, నేడు చంద్రబాబు ఇద్దరూ ఒకేరకమైన సౌండే చేస్తున్నారు. ఏపీలో అన్ని పార్టీలు కలవాలి. వైసీపీని ఓడించాలి. ఇదే వారి నినాదం. ఒక విధంగా ఈ పిలుపులో ఈ రెండు పార్టీల మధ్య తెలియని వలపు దాగుందని బీజేపీ అనుమానిస్తోంది.
బీజేపీ విషయం చూస్తే అలా లేదు. మా పొత్తు కేవలం జనసేనతో మాత్రమే అంటోంది. మరి పవన్ ఆలోచనలు అలా ఉన్నాయా అంటే సందేహమే. ఆయన అన్ని పార్టీలు కలవాలి అన్నప్పుడే టీడీపీని కూడా కలుపుకుని పోవాలని చూస్తున్నారు అన్నరాజకీయ విశ్లేషణలు వచ్చాయి. ఇక ఇపుడు జనసేనతో మైత్రి అంటూ బీజేపీ గట్టిగా మాట్లాడుతున్నా కూడా ఆ పార్టీ నుంచి పాజిటివ్ రియాక్షన్స్ అయితే అసలు రావడంలేదు.
ఈ నేపధ్యంలో బీజేపీ బరువుని మోసేందుకు తాను సిద్ధంగా లేనని జనసేన గట్టిగా చెబుతోందా అన్నదే చర్చ. ఏపీలో నోటా కంటే తక్కువ ఓట్లు 2019 ఎన్నికల్లో వచ్చిన బీజేపీ బలం ఈ మధ్యలో పెరిగిందా అంటే పెద్ద డౌటే. ఒక విధంగా బీజేపీతో పొత్తు అని జనసేన కట్టుబడితే రేపటి ఎన్నికల్లో ఫలితాలు తేడా కొడతాయి. అందుకే జనసేన కూడా సైలెంట్ గానే ఉంటోంది.
ఈ పరిణామాల నేపధ్యంలో ఏపీలో బీజేపీ మరోమారు ఒంటరి పోరుకే సిద్ధపడుతుందా అన్నదే చర్చ. లేకపోతే ఆ పార్టీ బరువు, పరువు మోసే పార్టీ ఏదీ అన్నది కూడా పెద్ద ప్రశ్న. మొత్తానికి ఏపీలో బలమైన టీడీపీ రాజకీయం కాదు కానీ బీజేపీ కి కొత్త రాజకీయ సవాళ్ళు అలా ఎదురవుతున్నాయి మరి.