ఏపీలో కండువాల పర్వానికి తెర తీసే తొలి పార్టీ బీజేపీ అవుతుందా. 2024 ఎన్నికల సీజన్ లో పార్టీలో చేరికలకు బీజేపీ ఆది గురువు అవుతుందా. అంటే ఆ పార్టీ నేతలు అవును అనే చెబుతున్నారు. ఈ నెల 7న గోదావరి గర్జన పేరిట భారీ బహిరంగ సభను రాజమండ్రీలో నిర్వహించేందుకు బీజేపీ సర్వసన్నద్ధం అవుతోంది.
రాకరాక వస్తున్న జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. ఏపీలో బీజేపీ బలమేంటో స్వయంగా చూడాలని ఆరాటపడుతున్న పార్టీ పెద్ద. అందుకే నడ్డా సభను ప్రతిష్టాత్మకంగా బీజేపీ తీసుకుంది అంటున్నారు. సభకు జనాలను తరలించే బాధ్యతను ఎక్కువగా విశాఖ జిల్లా తీసుకుంటోంది. రాజమండ్రీ సభకు తరలివెళ్ళేందుకు విశాఖ బీజేపీ నాయకులు, క్యాడర్ సిద్ధమవుతున్నారు.
ఇదిలా ఉంటే ఏపీలో వైసీపీని గద్దె దించే లక్ష్యంతో సాగుతున్న బీజేపీ గర్జన సభ సూపర్ సక్సెస్ అవుతుందని బీజేపీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ అంటున్నారు. ఈ సభ వేదికగా చాలా మంది నాయకులు ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరుతారు అని ఆయన చెప్పడం విశేషం. అలాగే వివిధ రంగాలకు చెందిన మేధావులు కూడా బీజేపీ తీర్ధం పుచ్చుకుంటారు అని ఆయన చెబుతున్నారు. ఇతర పార్టీ నాయకులు బీజేపీలో చేరడానికి సుముకత చూపిస్తున్నారని మాధవ్ అంటున్నారు
మరి ఇతర పార్టీల నుంచి నడ్డా సమక్షంలో చేరే కీలక నేతలు ఎవరు అన్న ఆసక్తి అయితే రాజకీయాల్లో కనిపిస్తోంది. ఏపీలో టీడీపీ భారీ స్థాయిలో వీర లెవెల్ లో జరిపిన మహానాడు సభలోనే చేరికలు లేవు. అయితే ఆ పార్టీ కూడా వ్యూహాత్మకంగా వాటిని పక్కన పెట్టింది అని అంటారు. ఇక రానున్న రోజుల్లో చాలా మంది అధికార పార్టీ నుంచి టీడీపీలోకి జంప్ చేస్తారు అని అంటున్నారు.
కొన్ని చోట్ల జనసేన పేరు కూడా వినిపిస్తోంది. మరి బీజేపీ విషయం తీసుకుంటే ఆ పార్టీ కండువా కప్పుకోవాలన్న ఉత్సాహం ఉన్న వారు ఎవరు అనే అంతా ఆలోచిస్తున్నారు. అయితే బీజేపీ జాతీయ స్థాయిలో ఉన్న పార్టీ. బలమైన పార్టీ కాబట్టి ఆ సిద్ధాంతాలను నచ్చి చేరేవారు ఉంటే ఉండవచ్చు. కానీ మేధావుల కంటే మాస్ లీడర్స్, క్రౌడ్ పుల్లర్స్ పార్టీలోకి వస్తేనే ఊపు ఉంటుంది. మరి రాజమండ్రీ గర్జన సభలో ఊపున్న నేతలు ఎవరైనా చేరితే బీజేపీ గర్జన సక్సెస్ అయినట్లే.