నెల రోజుల క్రితం ప్రధాని మోడీ ప్రభుత్వంపై అవిశ్వాసం తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు లోక్ సభలో జరిగిన చర్చ సందర్భంగా మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆ తర్వాత మోడీ దగ్గరకు వెళ్లి ఆయనను హగ్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఎపిసోడ్ పై వివిధ రకాల అభిప్రాయాలు వినిపించాయి. దీనిపై ఇప్పటికే రాహుల్ క్లారిటీ ఇచ్చినప్పటికీ...మళ్లీ ఆయన తన స్పష్టతను కొనసాగిస్తున్నారు. జర్మనీ పర్యటనకు వెళ్లిన రాహుల్.. హాంబర్గ్ నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మోడీకి ఇచ్చిన హగ్ గురించి మాట్లాడారు.మోడీ తన పట్ల ద్వేషపూరితంగా మాట్లాడినందుకే తాను హగ్ చేసుకున్నానని రాహుల్ తెలిపారు. అయితే మోడీకి తన ప్రవర్తన నచ్చలేదని, కాంగ్రెస్ పార్టీలో కొందరు సీనియర్ నేతలకు కూడా తాను మోడీని హగ్ చేసుకోవడం నచ్చలేదని రాహుల్ తెలిపారు.ఈ హగ్ అనంతరం పలువురు నేతలు తర్వాత తన దగ్గరికి వచ్చి అలా హగ్ చేసుకోవద్దని చెప్పారని రాహుల్ గాంధీ తెలిపారు. ద్వేషాన్ని ప్రేమతోనే జయించగలమని గాంధీ చెప్పారని… అందుకే మోడీ ద్వేషపూరితంగా మాట్లాడినందుకు తాను హగ్ చేసుకున్నానని రాహుల్ వివరణ ఇచ్చారు.
జర్మనీ పర్యటనలో ఉన్న రాహుల్ గురువారం బ్యుసెరియస్ సమ్మర్ స్కూల్ లో జరిగిన కార్యక్రమంలోనూ పాల్గొని మాట్లాడారు. గిరిజనులు - దళితులు - మైనార్టీలను బీజేపీ ప్రభుత్వం అభివృద్ధిలో భాగస్వామ్యం చేయట్లేదని రాహుల్ గాంధీ ఆరోపించారు. వారిని అభివృద్ధి నుంచి దూరం చేస్తే ప్రమాదకర పరిస్థితులు ఏర్పడతాయన్నారు. ఆ తిరుగుబాటు నెమ్మది నెమ్మదిగా ISISగా మారుతుందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతేగాక, భారతీయ పురుషులు మహిళలను తమతో సమానంగా చూడరంటూ వ్యాఖ్యానించారు. అయితే రాహుల్ వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా ఖండించింది. రాహుల్ గాంధీ మనదేశంలోనే గాక… విదేశాలకు వెళ్లి కూడా అబద్ధాలు చెబుతున్నారని బీజేపీ నేత సంబిత్ పాత్ర మండిపడ్డారు. కనీస జ్ఞానం లేకుండా రాహుల్ మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఆ పార్టీ బలంగా మద్దతు ఇచ్చే మతంలోనే మహిళలకు గౌరవం లేదని, దానిపై ముందు స్పందించాలన్నారు.