తూర్పు గోదావరి జిల్లా సామర్లకోట మండలం జి.మేడపాడులో భారీ పేలుడు సంభవించింది. సోమవారం ఉదయం సంభవించిన ఈ పేలుడులో 12మంది తీవ్రగాయాలపాలయ్యారు. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.
మేడపాడులోని బాణసంచా ఫ్యాక్టరీలో ఈ పేలుడు సంభవించింది. పేలుడు కారణంగా ఫ్యాక్టరీలో భారీగా మంటలు చెలరేగాయి. గాయపడ్డ వారిని స్థానికులు స్థానిక ఆస్పత్రికి తరలించారు. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను ఆర్పేశారు.
బాణాసంచాకు నిప్పురవ్వలు అంటుకొని ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టు కార్మికులు చెబుతున్నారు. పేలుడు సంభవించగానే కార్మికులు భయంతో బయటకు పరుగులు తీశారు. అప్పటికే మంటలు వ్యాపించడంతో 12మందికి తీవ్ర గాయాలయ్యాయి.
కాగా గాయపడ్డ వారిలో అత్యధికంగా మహిళలే ఉన్నారని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పేలుడుకు గల కారణాలపై ఆరాతీస్తున్నారు. ఫ్యాక్టరీకి అనుమతి ఉందా లేదా అన్నది అధికారులు ఆరాతీస్తున్నారు.