మనిషి జీవితం చెప్పుకోవడానికి 100 ఏళ్లు అయినా కానీ చాలా తక్కువ మంది అన్నీ ఏళ్లు బతుకుతున్నారు. ఇప్పటికే సగటు మనిషి ఆయురార్థం చాలా వరకు కుంగింది. దీంతో కనీసం 60 ఏళ్ళు బతకడం కూడా కష్టం అవుతుంది. ఇంకా చెప్పాలి అంటే వివిధ కారణాల వల్ల అన్ని ఏళ్లు బతికే వారు కూడా తక్కువ. దీనికి తోడు కొత్తగా పురుడు పోసుకుంటున్న వైరస్ ల కారణంగా మనిషి జీవితం మరింత ఆందోళన గా మారింది. ప్రస్తుతం చాలా మంది పిల్లలకు పెళ్లి చేసే వరకు అయినా బతికే బాగుండు అని ఫీల్ అవుతున్నారు అంటే ప్రాణం పట్ల వారికి ఉన్న అపనమ్మకం ఏంటో ఇట్టే అర్ధం అవుతుంది.
మనిషి జీవిత కాలం ఆయుష్షు నూరేళ్లు. అందుకే ఎవరైనా అనుకున్న వెంటనే మనం కనిపిస్తే వందేళ్లు నీకు అని అంటారు. తాజాగా ఓ దేశ శాస్త్రవేత్తలు చెబుతున్న దాని ప్రకారం చూస్తే.. ఇక మీరు ఎవరికైనా దీవెనలు ఇవ్వాలి అంటే వందేళ్లు కాదు.. 180 ఏళ్లు చల్లగా బతకండి అని దీవించాలి. దానికి గల కారణాలు ఏమిటో తెలుసుకుందాం.
కెనడాకు చెందిన శాస్త్రవేత్తలు చెబుతున్న దాని ప్రకారం మనిషి ఇక పై సుమారు 180 ఏళ్లు బతుకుతారు. అయితే ఇది ఇప్పుడే అనుకుంటే పొరపాటే. దీనికి ఇంకా టైం ఉంది. 2100 నాటికి మనిషి తన జీవనకాల సగటును పెంచుకుంటాడని చెప్తున్నారు. ఈ మేరకు ఆ దేశం లోని ప్రముఖ విశ్వవిద్యాలయం అయిన హెచ్ఈసీ యూనివర్సిటీ పరిశోధకులు ఈ విషయాన్ని వెల్లడించారు. సగటు మానవుడు ఎంత కాలం బతుకుతాడు అనే దానిపై వీరు పరిశోధన చేసినట్లుగా తెలిపారు. గత కొద్ది కాలంగా వీరు చేస్తున్న పరిశోధనలో మనిషి ఆయురార్ధం బాగా పెరుగుతుందని తెలినట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఈ పరిశోధనలకు హెడ్ అయిన లియో బెల్జిలె అనే యూనివర్సిటీ ప్రొఫెసర్ తెలిపారు.
ఇప్పటి వరకు ఎక్కువ కాలం జీవించిన వ్యక్తిగా ఓ ఫ్రెంచ్ మహిళ రికార్డు సృష్టించింది. ఆమె పేరు జీన్ కాల్మెంట్. సుమారు ఆమె 122 ఏళ్లు బతికింది. 1997లో ఆమె చనిపోయారు. ఇప్పటి వరకు ఆ రికార్డును ఎవరు బద్దలు కొట్టలేదు. ప్రపంచం మొత్తం మీద కూడా అన్ని ఏళ్లు బతికిన వారు లేరు. కానీ ఆమె రికార్డును త్వరలోనే చాలా మంది అధిగమిస్తారు అని చెప్తున్నారు ఈ కెనడా శాస్త్రవేత్తలు.
ఇదిలా ఉంటే మనిషి సగటు జీవన కాలం పెరిగితే.. అందుకు తగ్గట్టుగనే ప్రకృతిలో మార్పులు కూడా ఉంటాయి మరి కొందరు భావిస్తున్నారు. మరి కొందరు మాత్రం జీవన కాలం పెరిగితే వైరస్ ల కారణంగా ఆసుపత్రుల బారిన పడి ఎక్కువ డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తుందని ఛలోక్తులు విసురుతున్నారు.