ఏపీలో రెండే పార్టీలు.. అయితే టీడీపీ - లేదా వైసీపీ.. కానీ తెలంగాణలో అలా కాదు.. అధికార టీఆర్ ఎస్ కు గడిచిన సారీ బోటాబోటీ మెజార్టీనే ఓటర్లు కట్టబెట్టారు. ప్రతిపక్ష కాంగ్రెస్ కు ఓ 20 సీట్లు ఇచ్చారు. ఇక టీడీపీకి 15 - బీజేపీకి 5తోపాటు వైసీపీ - సీపీఐ - సీపీఎం - బీఎస్పీ - ఎంఐఎం ఇలా పది పార్టీలను తెలంగాణ అసెంబ్లీలోకి పంపించి తెలంగాణ ఓటర్లు విభిన్న తీర్పునిచ్చారు..
ఈసారి కూడా తెలంగాణలో అదే పునరావృతం కాబోతోంది. మహాకూటమిగా బరిలోకి దిగిన కాంగ్రెస్ - టీడీపీ - టీజేఎస్ - సీపీఐలు కనీస సీట్లు సాధించే అవకాశాలున్నాయి.. వీరిలో పార్టీకి కొందరైనా తెలంగాణ అసెంబ్లీలోకి అడుగుపెట్టి ప్రాతినిధ్యం వహించే అవకాశాలైతే ఉన్నాయి.
ఇక గడిచిన సారీ టీడీపీతో కలిసి పోటీచేసిన బీజేపీ 5 సీట్లు గెలుచుకోగా.. ఈసారి మొత్తం 118 సీట్లకు పోటీపడుతోంది. కనీసం 10 సీట్లలో బీజేపీ అభ్యర్థులు గెలిచేందుకు సిద్ధంగా ఉన్నారని ఆ పార్టీ భావిస్తోంది. ఇక పోయిన సారీ రెండు సీట్లు సాధించిన బీఎస్పీ కూడా ఈసారి ప్రభావం చూపే అవకాశాలున్నాయి. కాంగ్రెస్ - టీఆర్ ఎస్ రెబల్స్ చాలా మంది బీఎస్పీ పార్టీ తరుఫునే బరిలో నిలిచారు. దీంతో తెలంగాణ అసెంబ్లీ బరిలో బీఎస్పీ ఖాతా తెరవడం ఖాయంగానే కనిపిస్తోంది.
ఇక ఎంఐఎంకు ఎలాగూ 7 సీట్లు రిజర్వ్ చేయబడ్డాయి. ఇక తెలంగాణ బరిలో మరోపార్టీ బీఎల్ ఎఫ్ కూడా ఈసారి పోటీదారుగా నిలిచింది. ఈ పార్టీ తరుఫున కొందరు గట్టి అభ్యర్థులున్నారు. వీరు ఒకటి రెండు సీట్లు సాధించే అవకాశాలున్నాయట..బీఎల్ ఎఫ్ తో కలిసి వెళ్లిన సీపీఎం కూడా ఏడు ఎనిమిది నియోజకవర్గాల్లో ఓట్లు చీల్చి గెలిచే అభ్యర్థులను ప్రభావితం చేసే స్థాయిలో ఉందట..
ఈ చిన్న చితకా పార్టీలేకాక.. స్వతంత్రులు కూడా తెలంగాణ ఎన్నికల బరిలో అదృష్టం పరీక్షించుకుంటున్నారు.. మొత్తంగా ఏపీతో పోలిస్తే భిన్న సంస్కృతి - భిన్న పార్టీలు - భిన్న వ్యవహారాలున్న తెలంగాణలో పార్టీలు కూడా ఎక్కువగానే బరిలో ఉండడం విశేషంగా చెప్పవచ్చు.