తిరుపతి శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఆవరణలో నాటుబాంబులు పేలాయి. ఊహించని ఈ ఘటనతో విద్యార్థులు, స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. యూనివర్సిటీ ఆవరణలోని ఐ-బ్లాక్ సమీపంలో గురువారం ఉదయం రెండు నాటు బాంబులు పేలాయి.
ఈ ఘటనలో ఒక కుక్క, పంది ప్రాణాలు కోల్పోయాయి. ఈ బాంబుల శబ్దాలకు సమీపంలోని జనం బెంబేలెత్తిపోయారు. వెంటనే విషయాన్ని పోలీసులకు తెలిపారు. సమాచారం అందుకున్న యూనివర్సిటీ క్యాంపస్ పోలీసులు.. సంఘటనా స్థలానికి జాగిలాలతో చేరుకున్నారు.
ఆధారాలు సేకరించిన పోలీసులు.. అవి అడవి పందుల కోసం పెట్టిన నాటు బాంబులుగా గుర్తించారు. అనంతరం విచారణ చేపట్టి.. అక్కడ బాంబులు పెట్టిన వేటగాళ్లలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. యూనివర్సిటీలో ఎందుకు బాంబులు పెట్టారనే కోణంలో విచారణ చేపట్టారు.