మీటింగ్ త‌ర్వాత బంగ్లా దూకిన ఐటీ బాస్‌

Update: 2017-06-08 16:39 GMT
అన్ని సిద్ధాంతాల‌ను మాట‌ల్లో చెప్ప‌డం ఎందుకు అనుకున్నాడో ఏమో కానీ చేత‌ల్లో చూపించేందుకు ఏకంగా బంగ్లాపై నుంచే దూకేశాడు ఓ సాఫ్ట్‌ వేర్ సంస్థ వ్య‌వ‌స్థాప‌కుడు ! బోస్నియాలోని ఎన్‌ సాఫ్ట్‌ అనే సాఫ్ట్‌వేర్‌ సంస్థ ఫౌండర్‌ - ఓనర్‌ క్రెజిక్‌. ఇదంతా ఎప్పుడు చేశార‌నుకుంటున్నారు?  సీరియ‌స్‌గా ఆఫీసులో మీటింగ్ జ‌రుగుతుంటే...ఉద్యోగుల‌తో మాట్లాడుతూనే కిటికీలోంచి జంప్ చేసేశాడు. ఉద్యోగులు ప‌రిగెత్తుకొని వ‌చ్చి చూసే స‌రికి తాపీగా నవ్వుతూ ...మీకో విష‌యంలో ప్రాక్టిక‌ల్‌ గా చెప్పేందుకే ఇలా చేశాను అన్నాడు. అస‌లు ఏం జ‌రిగింది? ఏ విష‌యం చెప్పేందుకు ఇలా చేశాడు అనుకుంటున్నారు క‌దా!

ఆన్‌ లైన్‌ గేమింగ్‌ - స్పోర్ట్స్‌ బెట్టింగ్ ఇండస్ట్రీలో మంచి పేరున్నఎన్‌ సాఫ్ట్ సంస్థ అధిప‌తి అయిన క్రెజిక్ త‌న ఆలోచ‌న‌ల‌ను ఉద్యోగుల‌తో పంచుకునేందుకు పిలిచాడు. సీరియ‌స్‌ గా  త‌న మ‌న‌సులోని మాట‌లు చెప్పి అనంత‌రం కిటికీలోంచి దూకేశాడు. అయ్య బాబోయ్ బాస్ చచ్చిన‌ట్లున్నాడే అనుకుంటూ ఉద్యోగులు వెళ్లి చూడ‌గా...ముందుగానే రెడీ చేసుకున్న క్రాష్ మ్యాట్‌ పై తాపీగా న‌వ్వుతూ క‌నిపించాడు! ఏంటి బాస్ ఇది? అంటూ ఉద్యోగులు అయోమ‌యం వ్య‌క్తం చేయ‌గా...``పొలిటికల్‌ సూసైడ్‌’ అనే ముఖ్య‌మైన‌ అంశం గురించి మీకు చెప్పడానికే ఇలా చేశాను అంటూ వెకిలి న‌వ్వు ఒక‌టి న‌వ్వాడ‌ట‌. పేరుకు త‌గ్గ‌ట్లే క్రేజీ ఫెలో అయిన క్రెజిక్ గ‌తంలోనూ ఇలాంటివి చాలా చేశాడ‌ట‌.


Full View

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News