ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ తీరుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ నిప్పులు చెరిగారు. కర్నూలు జిల్లా నంద్యాలలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన బొత్స సత్యనారాయణ...ఉప ఎన్నికలు రాష్ట్రంలో చాలా సందర్భాల్లో వచ్చాయని అయినప్పటికీ నంద్యాల ఉప ఎన్నికకు ఎందుకింత ప్రాధాన్యం ఇస్తున్నారని ప్రశ్నించారు. తమకే ఓటు వేయాలని పోలీసులతో బలహీనవర్గాలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని బొత్స తెలిపారు. జిల్లా మంత్రి పోలీసుల చర్యకు వత్తాసు పలికారని ఆరోపించారు. గెలవలనే భయంతోనే ఇలా చేస్తున్నారా అని సందేహం వ్యక్తం చేశారు.
చెప్పిన మాటను నెరవేర్చే లక్షణం లేని చంద్రబాబు మళ్లీ నంద్యాల ప్రజలను మోసం చేసేందుకు రెడీ అయ్యారని బొత్స సత్యనారాయణ ఆరోపించారు. గతంలో కర్నూలు జిల్లాకు 33 వాగ్దానాలు చేశారని ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటైనా ఆచరణ సాధ్యమైందా అనేది ఆ పార్టీ నేతలే ఆలోచించుకోవాలని అన్నారు. ప్రజా సంక్షేమం గురించి చిత్తశుద్ధి లేకనే చంద్రబాబు హామీలు నెరవేర్చడం లేదని మండిపడ్డారు. కర్నూలును ఇదీ చేస్తాం అదీ చేస్తామని హామీలిస్తున్నారని అయితే ఒక సారి ఓటేసిన పాపానికి మొత్తం నాదే అంటే కుదరదని టీడీపీ తీరును బొత్స ఎద్దేవా చేశారు. అయితే టీడీపీ తాటాకు చప్పుళ్లకు నంద్యాల ప్రజలు భయపడరని తెలిపారు. రాష్ట్ర మంత్రులు ఏ ముఖం పెట్టుకుని వచ్చి నంద్యాలలో ఓట్లు అడుగుతారని బొత్స ప్రశ్నించారు. ప్రజల ఆవేదన, కన్నీళ్లు కన్పించడం లేదా? అని ఆయన నిలదీశారు. ప్రజాస్వామ్య స్పూర్తికి విరుద్ధంగా నంద్యాల ఉప ఎన్నిక ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమాలు,అరాచకాలతో గెలవాలని టీడీపీ భావన అని బొత్స ఆరోపించారు.
ప్రభుత్వ పెద్దలు మేం తప్ప అందరూ అమాయకులనుకుంటున్నారని, అయితే నంద్యాల ప్రజల అంత అమాయకులేమీ కాదని బొత్స అన్నారు. నంద్యాల నుంచే దుష్టశక్తులకు గుణపాఠం నేర్పాలని పిలుపునిచ్చారు. తప్పుడు వాగ్దానాలు చేస్తున్న టీడీపీని ప్రజలు నమ్మరని స్పష్టం చేశారు. పాలనలోని ముఖ్యులు, రాష్ట్ర మంత్రులే తీవ్రస్థాయిలో అవినీతికి పాల్పడ్డారని బొత్స ఆరోపించారు. డబ్బులిచ్చి ఓట్లు కొనేయాలని చంద్రబాబు అనుకుంటున్నారని తెలిపారు. దోచుకున్న డబ్బుతో ఓటుకు ఐదు వేలు ఇవ్వగలనని అనుకుంటున్నారని....చంద్రబాబు కంటికి ప్రజలంతా బిచ్చగాళ్లవలే కన్పిస్తున్నారని మండిపడ్డారు. సీఎం చర్యలు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టని ధ్వజమెత్తారు. టీడీపీ దుష్టశక్తుల నుంచి కాపాడుకోవాల్సిన సమయం వచ్చిందని తెలిపారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలన తిరిగి తెచ్చేందుకు నంద్యాల ఎన్నిక నాంది కావాలని ఆకాంక్షించారు.