బాబుది లాక్కునే బుద్ధి..మాది గౌర‌వించే గుణం

Update: 2017-08-02 11:30 GMT
తెలుగుదేశం పార్టీ నాయ‌కుడు, ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు లాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి క‌ప‌ట ప్రేమ‌లు, కుట్ర‌లు చేసే గుణం లేద‌ని పార్టీ సీనియ‌ర్లు బొత్సా స‌త్య‌నారాయ‌ణ, అంబ‌టి రాంబాబు తెలిపారు. చంద్ర‌బాబుది ప్ర‌త్య‌ర్థి పార్టీల‌కు చెందిన నాయ‌కుల‌ను లాక్కునే బుద్ధి అయితే.... ప్ర‌జాసంక్షేమం కోణంలో స్ప‌ష్ట‌మైన విధానాల‌ను అనుస‌రించి వైసీపీ కండువా క‌ప్పుకొనే నాయ‌కుల‌ను గౌర‌వించే త‌త్వం త‌మ పార్టీ సొంత‌మ‌ని వారు తెలిపారు. నంద్యాల‌లోని వైసీపీ పార్టీ కార్యాలయంలొ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో బొత్సా సత్యనారాయణ మాట్లాడుతూ రేపు  జరగబొయే వైసీపీ బ‌హిరంగ సభలో పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొంటారని అన్నారు. మద్యాహ్నం మూడు గంటలకు ఎస్పీజీ గ్రౌండ్స్ లో జరిగే బహిరంగ సభ వేదిక‌గా వైసీపీ అభ్యర్థిని ఎందుకు గెలిపించాలో వైఎస్ జ‌గ‌న్‌ ప్రజలకు తెలియజేస్తారని ఆయ‌న వివ‌రించారు.

రాష్ట్రం ప్రజలను తెలుగుదేశం పార్టీ ఏవిధంగా మోసం చేసిందో, చట్టాన్ని చేతుల్లొ కి ఏవిధంగా తీసుకుందో ప్రజలకు తెలియజేయటానికి జగన్మోహన్ రెడ్డి నంద్యాల వస్తున్నార‌ని బొత్సా సత్య‌నారాయ‌ణ తెలిపారు. దివంగ‌త సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి  హయాంలో ఏవిధంగా సంక్షేమం జరిగిందో, ఇప్పుడు మైనారిటీలకు ఏవిధంగా అన్యాయం జరుగుతుందో ప్రజలకు మరొసారి గుర్తు చేస్తారని వివ‌రించారు. వైసీపీ అభ్యర్దిని గెలిపించాలని నంద్యాల ప్రజలను ఆయన కోరనున్నార‌ని తెలిపారు. మూడు సంవత్సరాల‌ల్లో నంద్యాలను పట్టించుకోని తెలుగుదేశం నాయకులు ఇప్పుడు ఉప ఎన్నికల నేపద్యంలొ దొంగ ప్రేమ చూపిస్తున్నారని బొత్స మండిప‌డ్డారు. శిల్పా మోహన్ రెడ్డి శిల్సా సొసైటీ పేరుతొ ప్రజలకు తన సొంత డబ్బులతో సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు అని నంద్యాల ప్రజలు ఆయన్ని గెలిపించాలని ఆయన కోరారు. ఈసందర్భంగా ఓ విలేక‌రి  అడిగిన ప్రశ్నకు సమాదానం చెబుతూ వైసీపీ ఎప్పుడూ కూడా ప్రజలకు హమీలు ఇస్తుంది తప్ప నాయకులకు హామీ ఇవ్వదని బొత్స స‌త్య‌నారాయ‌ణ స్ప‌ష్టం చేశారు.

అనంతరం అంబటి రాంబాబు మాట్లాడుతూ డబ్బులు ఇచ్చి, పదవులు ఇచ్చి నాయకులను పార్టీలోకి ఆహ్వానించే కార్యక్రమం తెలుగుదేశం పార్టీలో జరుగుతోందని ,కాని జగన్మోహన్ రెడ్డిని చూసి వైసీపీలోకి చేరుతున్నారని అన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు నంద్యాల‌లో రోడ్ల విస్తరణ పేరుతో ర‌హ‌దారులు ధ్వంసం చేశార‌ని అన్నారు. పనులు పూర్తి చేయాలంటే టీడీపీకి ఓటు వేయాలని లేకపొతే పనులు జరుగవని ప్రజలను భయపెడుతున్నారు అంబ‌టి రాంబాబు తెలిపారు. కానీ నంద్యల ప్రజలు చాలా తెలివైన వారని అన్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ వైసీపీ అభ్యర్థిని గెలిపిస్తారని ఆయన అన్నారు.
Tags:    

Similar News