రాష్ట్ర విభజనపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ఘాటుగా స్పందించారు. కిరణ్‌కుమార్‌రెడ్డి తమ్ముడు టీడీపీలో చేరిక సందర్భంగా నిన్న చంద్రబాబు చేసిన ఆరోపణలను బొత్స సత్యనారాయణ ఖండించారు. విభజన జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీపై కిరణ్‌కుమార్‌రెడ్డి ఎంతగానో పోరాడాడని చంద్రబాబు పొగడటం ఆయన నీచ రాజకీయాలకు నిదర్శనమన్నారు. రాష్ట్ర విభజనకు చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతమే కారణమని బొత్స మండిపడ్డారు.
రాష్ట్రానికి సంబంధించిన అంశంపై ప్రజలను మభ్యపెట్టి పబ్బం గడుపుకుంటున్న తరుణంలో మరోమారు రాష్ట్ర విభజన అంశాన్ని తెరపైకి తెచ్చి వైఎస్‌ఆర్‌సీపీపై ఆరోపణలు చేయడం సిగ్గుచేటని బొత్స సత్యనారాయణ అన్నారు. ఎప్పుడైనా రాష్ట్ర విభజన జరుగకూడదని చంద్రబాబు అన్నారా అని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. ఆ రోజు రెండు కళ్ల సిద్ధాంతం అని చెప్పి, పార్లమెంట్‌లో తీర్మానం పెట్టండి మేం సమర్థిస్తామని ఎర్రనాయుడితో ఆ లేఖ పంపించింది మీరు కదా అని నిలదీశారు. 2009లో సీఎంగా రోశయ్య అధ్యక్షతన అఖిల పక్ష సమావేశం జరిగినప్పుడు ఇప్పుడు కేంద్రంలో కేబినెట్ మంత్రిగా ఉన్న అశోక్‌గజపతిరాజు, గాలి ముద్దుకృష్ణమనాయుడు, మోత్కుపల్లి నరసింహులను సమావేశానికి పంపించింది మీరు కదా అని సూటిగా ప్రశ్నించారు. `రాష్ట్ర విజభనకు మేం మద్దతిస్తామని చెప్పింది మీరు కాదా? ఆ రోజు రాష్ట్రంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదు కదా? అయినప్పటికీ...ఈ రోజు ఆ రెండు పార్టీలు అంటూ నిందలు మోపుతారా?` అని మండిపడ్డారు.
ఆ సమయంలో సీఎం కిరణ్ కుమార్ రెడ్డి తాను బ్యాట్స్‌మెన్‌ను తనకు అన్ని తెలుసు అని ప్రజలను మభ్యపెట్టారని బొత్స మండిపడ్డారు. ఆ రోజు రాష్ట్ర విభజనకు సంబంధించి చంద్రబాబుకు ఎంత తెలుసో..నాడు పీసీపీ అధ్యక్షుడిగా ఉన్న తనకు తెలుసు అని బొత్స సత్యనారాయణ అన్నారు. `మీ రాజకీయ మనుగడ కోసం రాష్ట్ర విభజనకు అనుకూలంగా వ్యవహరించారు. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంతో మీరు కుమ్మక్కై రాష్ట్ర విభజనకు మద్దతిచ్చింది వాస్తవం కాదా? ఇప్పటికైనా మించిపోయింది లేదని, విభజించిన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కృషి చేయాలి` అని హితవు పలికారు. అవాకులు, చవాకులు పేల్చుతూ సమయం వృథా చేయవద్దని సూచించారు. ఏ సందర్భంలో కాంగ్రెస్‌తో మేం జత కట్టామో ఆ నేపథ్యం చెప్పాలని పట్టుబట్టారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి కూడా పార్టీ మారే సూచనలు ఉన్నాయని వార్తలు వస్తోన్న తీరును ఆయన స్పందిస్తూ తనకు తెలిసినంతవరకు తమ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరూ ఇతర పార్టీల్లోకి వెళ్ళరని స్పష్టం చేశారు.
పార్టీ ఫిరాయింపుల విషయంలో తమ సిద్ధాంతకాలకు కట్టుబబడి ఉన్నామని...వారిపై చర్యలు తీసుకునే వరకు తాము అసెంబ్లీకి హాజరుకాబోమని బొత్స సత్యనారాయణ అన్నారు. ఇప్పటివరకు తమ పార్టీ నుంచి టీడీపీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలందరూ వారి స్వార్థ ప్రయోజనాల కోసమే వెళ్లారని వ్యాఖ్యానించారు. నియోజకవర్గ అభివృద్ది కోసం వెళ్లామని చెప్పుకుంటోన్న పార్టీ మారిన శాసనసభ్యులు ఇప్పటివరకు ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. వారిని పార్టీ మార్పించడం ద్వారా ఆయా నియోజకవర్గ ప్రజలకు కలిగిన మేలు ఏమిటని ప్రశ్నించారు.