అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు చెందిన కారును తగలెట్టేశారు. అంత పెద్ద డాన్ కారును తగలెట్టేయటమా? అన్న సందేహం అక్కర్లేదు.. నిక్షేపంగా తగలెట్టాశోడా వ్యక్తి. అది కూడా ముందస్తుగా ప్లేసు.. టైం చెప్పి మరీ నిప్పు పెట్టేశాడు. ఇదంతా ఎక్కడో కాదు దేశ రాజధాని ఢిల్లీకి దగ్గర్లో చోటు చేసుకుంది. ఇంతకీ ఇదెలా సాధ్యమైందంటే..
ఈ మధ్యన దావూద్ ఇబ్రహీంకు చెందిన ఆస్తుల్ని వేలం వేసిన సంగతి తెలిసిందే. ఈ ఆస్తుల్లో ఒక డొక్కు కారు కూడా ఉంది. గ్రీన్ కలర్ హుంద్యాయ్ ఎక్సెంట్ కారు ఉంది. దాన్ని.. ఢిల్లీకి చెందిన స్వామి చక్రపాణి అనే వ్యక్తి రూ.32వేలకు కొనుగోలు చేశారు. ఇంతకీ ఈ పెద్ద మనిషి ఎవరంటే.. ఆల్ ఇండియా హిందూ మహాసభ జాతీయ అధ్యక్షుడు. డాన్ కారును కొనుగోలు చేసి.. దాన్ని కాస్తంత రిపేర్ చేయాలని భావించాడు. ఆ కారును అంబులెన్స్ గా మార్చి వినియోగించాలని భావించాడు. ఆయన అలా ఆలోచిస్తే.. గుర్తు తెలియని వ్యక్తులు మాత్రం దావూద్ కారునే కొనుగోలు చేస్తావా? అంటూ ఫోన్లు చేసి బెదిరించారు.
దీంతో మంట పుట్టిన స్వామి.. తనకే వార్నింగ్ లు ఇస్తారా అంటూ బుధవారం మధ్యాహ్నం ఒంటి గంటకు కారును తగలబెట్టేస్తానని బహిరంగంగా ప్రకటించారు. దావూద్ కారును కాల్చేయటం ద్వారా.. దావూద్ గ్యాంగ్ కార్యకలాపాలకు అంత్యక్రియలు చేసినట్లు అవుతుందని ప్రకటించాడు. అన్నట్లే.. ఢిల్లీకి దగ్గర్లోని ఘజియాబాద్ లో ఈ రోజు మధ్యాహ్నం దావూద్ కారును కాల్చేశారు. దీనికి ముందు కారు ముందు భాగంలో దావూద్ ఫోటోను పెట్టేసి.. కారు లోపల కట్టెలు పేర్చేసి.. తగలబెట్టేశాడు. కారును కాల్చేయటంతో తీవ్రవాదానికి అంత్యక్రియలు చేసినట్లుగా స్వామి చక్రపాణి చెప్పుకున్నారు.