బ్రేకింగ్ : కామారెడ్డిలో ఆర్మీ జవాన్‌కు కరోనా లక్షణాలు ...!

Update: 2020-03-19 11:30 GMT
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమ క్రమంగా పెరుగుతోంది. ఇప్పటి వరకు 13 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. వీరిలో 9 మంది విదేశీయులే. కాగా, తాజాగా కామారెడ్డిలో కరోనా కలకలం రేగింది. ఓ ఆర్మీ జవాన్‌ లో కరోనా లక్షణాలు కనిపించడం తో కుటుంబ సభ్యులు వెంటనే అప్రమత్తమయ్యారు. మొదట కామారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించి , ఆ తరువాత కరోనా పరీక్షల కోసం హైదరాబాద్‌ లోని చెస్ట్ ఆస్పత్రికి అతడిని తరలించారు. జవాను మూడు రోజుల క్రితం జమ్ముకశ్మీర్ నుంచి రైలులో కామారెడ్డి వచ్చాడు. జవాన్ తో పాటు రైలు లో ప్రయాణించిన 8మందికి కరోనా ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు.

కాగా, కరీంనగర్‌ లో సంచరించిన ఏడుగురు విదేశీయులు కు బుధవారం కరోనా పాటిజివ్ వచ్చినట్లు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ధృవీకరించారు. వారంతా ఇటీవల ఢిల్లీ నుంచి రామగుండం వరకు ఏపీ సంపర్క్‌ క్రాంతి రైలు లో ప్రయాణించగా...అదే రైలులో ఈ ఆర్మీ జవాన్ కూడా అదే రైలులో వచ్చినట్లు తెలుస్తోంది. దీనితో ప్రభుత్వం వారు ప్రయాణించిన ఏపీ సంపర్క్ క్రాంతి రైలులోని S-9 బోగీలో వారితో పాటు ప్రయాణించిన వ్యక్తుల వివరాలను సేకరిస్తోంది.

తెలంగాణలో కరోనా పాజిటివ్‌ కేసులు పెరిగిపోతున్నాయి. ఇప్పటిదాకా 13 కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. బీఆర్కే భవన్‌లో మంత్రి ఈటల రాజేందర్‌ సమీక్ష నిర్వహించారు. కరోనా నియంత్రణ చర్యలపై సీఎస్‌, ఆరోగ్యశాఖ అధికారుల తో సమీక్షించారు. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు మరిన్ని నిర్ణయాలు తీసుకోనున్నారు. కరోనా కట్టడికి కేసీఆర్ సర్కార్ మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకోనుందని సమాచారం . తెలంగాణ వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేయడం, హైదరాబాద్ లో ఆంక్షలు మరింత కఠినతరం చేయడం, ఆర్టీసీ బస్సు సర్వీసులను పరిమితం చేయడం, హోటల్స్ మూసివేత వంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం. మరికాసేపట్లోనే సీఎం కేసీఆర్ కరోనా పై మరోసారి మీడియా సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు. ప్రస్తుతం కరోనా పై అందుబాటులో ఉన్న మంత్రుల తో ఐపీఎస్ , ఐఏఎస్ లతో సమగ్ర సమీక్ష నిర్వహిస్తున్నారు.
Tags:    

Similar News