బ్రేకింగ్: ఏలూరులో ఎన్నికలు ఆపేయండి.. హైకోర్టు కీలక తీర్పు, అయోమయంలో అభ్యర్థులు !
మున్సిపల్ ఎన్నికల ప్రచారం మరికాసేపట్లో ముగుస్తుంది అనగా హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు కార్పొరేషన్ ఎన్నికలు నిలిపివేయాలని హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఏలూరు పరిధిలోని ఓటర్ల జాబితా అంశంలో దాఖలైన పిటిషన్ పై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం.. ఎన్నికలు ఆపాలని ఎస్‌ఈసీ కి ఆదేశాలు జారీచేసింది. ఎన్నికల్లో గెలుపు కోసం అన్ని పార్టీల అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారం చేపట్టారు.
మరి కొద్దిసేపట్లో ఎన్నికల ప్రచారం ముగియనున్న నేపథ్యంలో హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. దీంతో అభ్యర్థులు అయోమయంలో పడ్డారు. అంతకుముందు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల వ్యవహారంలో దాఖలైన పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపింది. గతేడాది జరిగిన నామినేషన్ల ప్రక్రియలో బెదిరింపులు, బలవంతపు ఉపసంహరణలు జరిగాయని జనసేన పార్టీ ఆరోపణలు చేస్తుంది. ఈ నేపథ్యంలో కొత్త నోటిఫికేషన్ విడుదలపై రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ ఆ పార్టీ కార్యదర్శి శ్రీనివాసరావు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై ఉన్నత న్యాయస్థానం తుది విచారణ జరిపి తీర్పును రిజర్వులో ఉంచింది.
ఏపీలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఇక బయటి ప్రాంతాల నేతలు వెళ్లిపోవాల్సి ఉంటుంది. స్థానిక నేతలు మాత్రమే ఉండాలి. ఐదు దాటితే ఎక్కడా జెండాలు కనిపించకూడదు. ప్రచారం అసలే చేయకూడదు. బుధవారం ఉదయం 7 గంటల నుంచి ఐదు గంటల పోలింగ్ జరుగుతుంది. కరోనా నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. మాస్క్ తప్పనిసరి. బ్యాలెట్ పద్ధతినే ఈ ఎన్నిక జరుగుతుంది.
14వ తేదీన ఆదివారం ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ఉంటుంది.12 కార్పొరేషన్లు, 75 మున్సిపాల్టీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 12 కార్పొరేషన్లలో 671 డివిజన్లు ఉంటే… 89 ఏకగ్రీవం అయ్యాయి. 582 డివిజన్లలో ఎన్నికలు జరుగుతాయి. 75 మున్సిపాల్టీల్లో 2123 వార్డులు ఉంటే.. 490 ఏకగ్రీవం అయ్యాయి. 1633 వార్డులకు ఎన్నికలు ఉన్నాయి. ఏకగ్రీవాల్లో వైసీపీ 570 వార్డులు వచ్చాయి. టీడీపీకి ఆరు, బీజేపీకి ఒకటి, ఇతరులు రెండు చోట్ల ఏకగ్రీవంగా గెలిచారు. పుంగనూరు, పులివెందుల, మాచర్ల, పిడుగురాళ్లల్లో వైసీపీ క్లీన్‌స్వీప్ చేసింది. ఏకగ్రీవాలను బట్టి రాయచోటి, పలమనేరు, ఆత్మకూరు మున్సిపాల్టీలు వైసీపీవే. నాయుడుపేట, సూళ్లురుపేట, కొవ్వూరుల్లోనూ ఆ పార్టీ అభ్యర్థులే చైర్మన్లు అవుతారు. డోన్, తుని మున్సిపాల్టీల్లోనూ వైసీపీదే హవా.