పెళ్లి ఆగిపోవటం పెద్ద న్యూస్ కాదు. మామూలే. పెళ్లి ఆగటానికి బోలెడన్ని రీజన్స్ ఉంటాయి. తాజాగా బిహార్ లో ఆగిన పెళ్లి జాతీయవార్త అయ్యింది. కారణం తెలిస్తే.. ఇలాంటి కారణానికి కూడా పెళ్లి ఆగిపోతుందా? అనుకోవటం ఖాయం. అంతేనా.. ఆగిన పెళ్లి కారణంగా పెద్ద గొడవ.. కొట్లాట.. పోలీసు కేసులతో ఇదో పెద్ద న్యూస్ అయిపోయింది.
ఇంతకీ పెళ్లి ఎందుకు ఆగింది? దానికి కారణం ఏమిటి? అన్నది చూస్తే.. బిహార్ లోని సరన్ జిల్లా చిట్రసెన్ పూర్ గ్రామానికి చెందిన ఒక యువతికి.. అదే గ్రామానికి చెందిన కుర్రాడితో పెళ్లి సెటిల్ అయ్యింది. ఘనంగా ఎంగేజ్ మెంట్ కూడా చేశారు. పెళ్లి రోజు రానే వచ్చింది. అంతా సిద్ధమై.. పెళ్లి పీటల మీద కూర్చొని..కాసేపట్లో ఇద్దరు ఒక్కటయ్యే సందర్భంలో అనుకోనిది జరిగింది.
పెళ్లి ముహుర్తం దగ్గరకు వచ్చిన వేళ.. దట్టమైన మేఘాలు కమ్ముకొని.. పెళ్లి మండపానికి దగ్గర్లో ఒక పిడుగు పడింది. ఆ శబ్దం విన్న వరుడు తీవ్రంగా భయపడ్డాడు. అంతే.. పెళ్లి కొడుకు అలా భయపడటం పెళ్లి కుమార్తెకు అస్సలు నచ్చలేదు. ఇలాంటి పెళ్లి తనకు వద్దంటే వద్దంది.
పిడుగుశబ్దానికే భయపడే పెళ్లి కొడుకు తనకు వద్దని తేల్చేసి చెప్పిందా అమ్మాయి. దాంతో పెళ్లికి వచ్చిన వారే కాదు.. అందరూ షాక్ తిన్నారు. సర్దిచెప్పటానికి ప్రయత్నించారు. నో చెప్పేసింది. కాసేపు మాటలు జరిగిన తర్వాత అమ్మాయి అభిప్రాయానికి విలువ ఇవ్వాలని పెళ్లికుమార్తె తరఫు వారు నిర్ణయించుకోవటంతో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది.
అబ్బాయి.. అమ్మాయిల తరపు వారి మద్య వాదన కాస్తా కోట్లాట వరకూ వెళ్లింది. పెళ్లి మండపటం కాస్తా రణరంగంగా మారింది. ఈ గొడవ గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఎంటర్ అయ్యారు. ఇరు వర్గాలకు కౌన్సెలింగ్ ఇచ్చే ప్రయత్నం చేసినా.. పరిస్థితిలో మార్పు రాలేదు. చివరకు దాడి చేశారన్న పెళ్లికొడుకు బంధువుల ఫిర్యాదుతో పెళ్లి కుమార్తె బంధువుల్లో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పుడు చెప్పండి.. పెళ్లి ఆగిపోవటానికి పిడుగు శబ్దం కూడా కారణమవుతుందంటారా?