మన దాయాది దేశం.. పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ కుటుంబానికి పెద్ద చిక్కే వచ్చిపడింది. పాకిస్థాన్ ప్రధానిగా వ్యవహరించిన సమయంలో ఆయన కుటుంబం పలు అవినీతి, అక్రమాలకు పాల్పడిందనే కారణంగా.. విచారణ చేపట్టిన పాక్ ప్రభుత్వం.. ఆయనకు జైలు శిక్ష విధించింది. దీంతో ఆయన జైలు జీవితం అనుభవించారు. ఈ క్రమంలో ఆయన తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో బెయిల్ మంజూరైంది. అయితే.. దీనిని సాకుగా చూపిన షరీఫ్ కుటుంబం ఉన్నతస్థాయి వైద్యం పేరిట.. బ్రిటన్‌కు వెళ్లింది. ఇక, అప్పటి నుంచి అక్కడే ఉంది. అయితే.. ఇప్పుడు బ్రిటన్‌లోనూ షరీఫ్ ఫ్యామిలీకి పెద్ద చిక్కు వచ్చింది.
అడకత్తెరలో షరీఫ్ కుటుంబం
2019 నుంచి వీఐపీ వీసాపై బ్రిటన్‌లో ఉంటున్న షరీఫ్‌ను తమ దేశం విడిచి వెళ్లిపోవాలని బ్రిటన్ హుకుం జారీ చేసింది. వీసా పొడిగింపు కోసం ఆయన, ఆయన సతీమణి చేసుకున్న దరఖాస్తును బ్రిటన్ హొం మంత్రిత్వ శాఖ కార్యాలయం నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. అంతేకాదు.. తక్షణమే దేశం నుంచి వెళ్లిపోవాలని ఆదేశించింది. ప్రధానిగా ఉన్న సమయంలో పాకిస్థాన్‌లో అవినీతి కేసుల్లో శిక్ష పడ్డ షరీఫ్ నిబంధనలకు విరుద్ధంగా దేశంలో ఉంటున్నారని, ఇక, ఇప్పటికైనా దేశం విడిచి తక్షణమే వెళ్లాల్సిందేనని స్పష్టం చేసింది. లేనిపక్షంలో బలవంతంగా అయినా.. పాకిస్థాన్‌కు అప్పగిస్తామని.. బ్రిటన్ హెచ్చరించడం.. షరీఫ్ ఫ్యామిలీని అడకత్తెరలోకి నెట్టేసినట్టయింది.
20 కోట్ల అవినీతి కేసులో..
71 ఏళ్ల నవాజ్ షరీఫ్.. పాకిస్తాన్ ప్రధానిగా ఉన్న సమయంలో రెండు అవినీతి కేసుల్లో చిక్కుకున్నారు. వీటిపై విచారణ జరిపిన ప్రభుత్వం.. ఆయనను ముద్దాయిగా తేల్చింది. అల్ అజీజియా మిల్స్ కేసులో 20 కోట్ల రూపాయల వరకు ప్రధానిగా ఉన్న షరీఫ్ కుటుంబానికి లబ్ధి చేకూరిందని.. దీనికి ఆయనే బాధ్యుడని పేర్కొంటూ.. 2018లో లాహోర్ కోర్టు ఆయనకు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ క్రమంలో లాహోర్ జైలులో శిక్ష అనుభవిస్తున్న నవాజ్ తీవ్ర మానసిక ఒత్తిడికి గురై.. అనారోగ్యం పాలయ్యారు. దీంతో ఆయనకు వైద్య చికిత్స కోసం లాహోర్ కోర్టు నాలుగు వారాల బెయిల్ మంజూరు చేసింది.
వైద్యం పేరుతో పలాయనం
ఉన్నతస్థాయి నాణ్యమైన వైద్యం చేయించుకునే నెపంతో షరీఫ్ కుటుంబం.. బ్రిటన్‌కు చిత్తగించింది. చికిత్స కోసం అంటూ.. 2019లో ఇంగ్లాండ్‌కు వచ్చారు. ఇక అప్పటినుంచి లండన్‌లోనే ఉంటున్నారు. అయితే, ఇతర దేశాల వారు ఆరు నెలల కంటే ఎక్కువ సమయం బ్రిటన్‌లో ఉండటానికి వీలు లేదనే చట్టం మేరకు.. తాజాగా షరీఫ్ వీసాను పొడిగించేందుకు బ్రిటన్ సర్కారు నిరాకరించింది. తక్షణమే ఆయన బ్రిటన్‌ను వీడాలని లేకుంటే చట్ట ప్రకారం చర్యలు తప్పవని కూడా బ్రిటన్ సర్కారు హెచ్చరించడం.. గమనార్హం. మరి ఇప్పుడు షరీఫ్ ఏం చేస్తారో చూడాలి.