విమానంలో ల్యాండింగ్ కు ముందు పొగలు, 175 మంది విలవిల

Update: 2019-08-06 09:23 GMT
సంవత్సరం సంవత్సరానికి విమాన ప్రయాణికుల సంఖ్య విపరీతంగా పెరుగుతూనే ఉంది. అక్కడక్కడ విమాన ప్రమాదాలు జరుగుతున్నా కూడా తప్పని పరిస్థితుల్లో విమాన ప్రయాణాలు చేస్తూనే ఉన్నారు. తాజాగా బ్రిటీష్‌ ఎయిర్‌ వేస్‌ కు చెందిన బీఏ 422 విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు చావు అంచుల వరకు వెళ్లి వచ్చారు. విమానంలో సాంకేతిక లోపం కారణంగా మొత్తం పొగ కమ్మేసింది. ఆ సమయంలో విమాన సిబ్బంది సరిగ్గా స్పందించడంతో 175 మంది ప్రాణాలు నిలిచాయి.

లండన్‌ నుండి స్పెయిన్‌ కు బయలుజేరిన బీఏ 422 విమానం మరి కొన్ని నిమిషాల్లో ల్యాండ్‌ అవ్వబోతుందనగా అంతా కూడా దిగేందుకు సిద్దం అవుతున్నారు. ఆ సమయంలోనే గుప్పుమంటూ పొగ వచ్చింది. దాంతో పైలెట్‌ విమానంను అత్యవసర ల్యాండ్‌ చేయడం జరిగింది. విమానం ల్యాండ్‌ అయిన వెంటనే హడావుడిగా ప్రేక్షకులను సిబ్బంది దించేశారు. ఆ సమయంలో కాస్త తొక్కిసలాట జరిగింది. ఈ విషయాన్ని అంతా కూడా లూసీ బ్రౌన్‌ అనే ప్రయణికురాలు ఫొటోలు వీడియోలు తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది.

లూసీ బ్రౌన్‌ పోస్ట్‌ వైరల్‌ అయ్యింది. ఈ సంఘటనపై బ్రిటీష్‌ ఎయిర్‌ వేస్‌ కు చెందిన ఒక అధికారి స్పందిస్తూ విచారం వ్యక్తం చేశాడు. అదృష్టవశాత్తు ఎవరికి ఏ ప్రమాదం జరుగలేదు. విమానంలో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా పొగ వచ్చినట్లుగా ఆయన పేర్కొన్నాడు. ఆ సమస్య మరి కొన్ని నిమిషాల ముందు వచ్చి ఉంటే తల్చుకుంటేనే భయం వేస్తుందని ఒక ప్రయాణికుడు అన్నాడు. మొత్తానికి ఆ 175 మందికి అదృష్టం బాగుండి తృటిలో ప్రమాదం తప్పింది.
Tags:    

Similar News