అల్వాల్ లో దారుణం.. ఫారిన్ వెళ్లి వచ్చిన ఆ ఇద్దరి పెద్దోళ్లను గెంటేశారు
కరోనాకు భయపడటం కంటే అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం. భయపడినంత మాత్రాన.. బెదిరిపోయినంత మాత్రాన కరోనా సోకకుండా ఉండదు. దాని కంటే.. కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు వీలుగా జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. ఆ చిన్న విషయాన్ని మర్చిపోయి.. ఇద్దరు పెద్ద వయస్కుల విషయంలో హైదరాబాదీయులు వ్యవహరించిన తీరు సంచలనంగా మారింది. ఇటీవల విదేశాలకు వెళ్లి వచ్చారన్న ఒకే ఒక్క కారణం తో వారున్న ఇంట్లో నుంచి గెంటివేసిన వైనం ఇప్పుడు షాకింగ్ గా మారింది.
హైదరాబాద్ మహానగరంలోని అల్వాల్ లోని ఒక అపార్ట్ మెంట్ లో చోటు చేసుకున్న ఈ ఉదంతంలోకి వెళితే.. ఇద్దరు పెద్ద వయస్కులు ఇటీవల విదేశాలకు వెళ్లారు. వారం క్రితం వారు హైదరాబాద్ కు తిరిగివచ్చారు. ఈ సమాచారం తెలుసుకున్న అపార్ట్ మెంట్ వాసులు.. ఆ ఇద్దరు పెద్ద వయస్కుల జంటను ఇంటి నుంచి వెళ్లిపోవాలని ఒత్తిడి తెస్తున్నారు.
ఈ క్రమంలో మంగళవారం రాత్రి అపార్ట్ మెంట్ నుంచి ఆ దంపతుల్ని గెంటివేశారు. రాత్రి వేళ.. ఎక్కడికి వెళ్లాలో అర్థం కాని పరిస్థితుల్లో.. అపార్ట్ మెంట్ బయట వారిద్దరూ బిక్కుబిక్కుమంటూ కూర్చున్న పరిస్థితి పలువురిని కదిలించివేసింది. అలా చేయటం మహా దారుణమని కొందరు వ్యాఖ్యానిస్తున్నా.. కరోనా భయం తో ఎవరికి వారు మౌనంగా ఉన్న పరిస్థితి. ఈ అపార్ట్ మెంట్ లో మొత్తం యాభై కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. కరోనా భయం తో ఇంత ఆరాచకంగా వ్యవహరిస్తారా? అని ఈ ఉదంతం గురించి తెలిసిన వారు షాక్ తింటున్నారు.