బ‌ఫెట్‌.. ముకేశ్ అంబానీని నెట్టేసిన ఎల‌న్ మస్క్‌

Update: 2020-07-12 11:10 GMT
ప్ర‌పంచంలో అత్యంత సంప‌న్నుల జాబితాలో మార్పులు జ‌రిగాయి. తొలి ఆరు స్థానాలు ప‌దిలంగా ఉండ‌గా ఏడో స్థానం మారిపోయింది. ఆ స్థానంలోకి టెస్లా కంపెనీ య‌జ‌మాని.. స్పేస్ ఎక్స్ సీఈఓ ఎల‌న్ మ‌స్క్ నిలిచాడు. ఆ స్థానంలో ఉన్న వారెన్ బ‌ఫెట్‌.. మ‌న ముకేశ్ అంబానీని వెన‌క‌కు నెట్టేశాడు. రెండు రోజుల్లోనే అత‌డి సంప‌ద విలువ భారీగా పెర‌గ‌డంతో ఆయ‌న స్థానం ముందుకు వెళ్లింది.

రెండు రోజుల్లో 6.1 బిలియ‌న్లు ఆయ‌న సంప‌ద పెర‌గ‌డంతో ఎల‌న్ మ‌స్క్ అత్యంత ధ‌న‌వంతుల జాబితాలో ఏడో స్థానానికి చేరాడు. ఇప్ప‌టివ‌ర‌కు మ‌స్క్ మొత్తం ఆస్తుల విలువ 70.5 బిలియ‌న్ డాల‌ర్లుగా ఉంది. ఈ విష‌యాన్ని బ్లూంబర్గ్ బిలియ‌నీర్స్ సంస్థ ప్ర‌క‌టించింది.

ఎల‌న్ మ‌స్క్ సంప‌ద పెర‌గ‌డానికి కార‌ణాలు తెలియ‌డం లేదు. ప్ర‌స్తుత విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో కూడా ఎల‌న్ మ‌స్క్ సంప‌ద అనూహ్యంగా పెర‌గ‌డం గ‌మ‌నార్హం. ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్య‌వ‌స్థ చిన్నాభిన్న‌మైన స‌మ‌యంలో ఎల‌న్ సంప‌ద పెరుగుతోంది.
Tags:    

Similar News