సోషల్ మీడియాతో వేర్పాటు వాదాన్ని నూరిపోయటం.. ఉగ్రవాదాన్ని పెంచి పోషించే సత్తా ఉన్న మోస్ట్ డేంజరస్ ఉగ్రవాది బర్హన్ వానీని కశ్మీర్ పోలీసులు ఎన్ కౌంటర్ చేసేయటం తెలిసిందే. అతగాడిని పోలీసులు ఎన్ కౌంటర్ చేశారన్న వెంటనే వేలాదిమంది అతడి అంతిమయాత్రలో పాల్గొన్నారు. ఇన్ని వేల మంది అభిమానాన్ని పొందిన ఇతగాడు.. తాను ప్రేమించిన ప్రేయసి మనసును మాత్రం దోచుకోలేకపోయాడు. అందరి కంటే ఎక్కువగా ఇతడ్ని దగ్గరగా చూసిన సదరు ప్రేయసి.. ఇతడి దుర్మార్గాన్ని చూసి తట్టుకోలేకపోయినట్లుంది. అందుకే.. అతగాడి జాడను గుట్టుగా పోలీసులకు చెప్పేసింది.
బర్హాన్ ఎన్ కౌంటర్ తో కశ్మీర్ వ్యాలీ ఎంతగా ఉడికిపోతుందో తెలిసిందే. ఇలాంటి వ్యక్తిని అతడి ప్రేయసే పోలీసుల సమాచారం అందించిందంటే దాని కారణం ఆసక్తికరమని చెప్పాలి. ప్రేయసితో పాటు.. ఆమె ఎంత వద్దన్నా పలువురు యువతులతో గడపటం.. వారితో అక్రమ సంబందాలు పెట్టుకోవటాన్ని అతగాడి లవ్వర్ తట్టుకోలేకపోయిందట. ఎన్ని చెప్పినా వినని అతగాడికి గట్టి గుణపాఠం చెప్పాలన్న ఉద్దేశంతో అతడికి సంబంధించిన సమాచారం పోలీసులకు అందించినట్లుగా చెబుతున్నారు. అనంత్ నాగ్ జిల్లాలో అతడున్న ప్రాంతం గురించి వివరాల్ని అందించటంతో పోలీసులు గుట్టుగా మొదలెట్టిన ఆపరేషన్ తో అతడ్ని ఎన్ కౌంటర్ చేసేశారు.