కరోనా కల్లోలం ... ఒకేసారి 20 మృతదేహాలకు ఖననం !

Update: 2021-05-05 13:30 GMT
సాధరణంగా ఓ వ్యక్తి చనిపోతే వారిని ఈ లోకం నుంచి సాగనంపే విషయం ప్రతి మతానికీ ఓ సంప్రదాయం ఉంటుంది. సంప్రదాయాలను అనుసరించి ఒక పద్ధతి ప్రకారం అంత్యక్రియలు నిర్వహించి ఖననం చేస్తేనే చనిపోయిన వ్యక్తి ఆత్మకు శాంతి చేకూరుతుందని నమ్ముతారు. చివరి గడియల్లో వెంట ఉండాలని, చనిపోయిన మనిషిని చివరి చూపు చూసుకోవాలని, దగ్గరుండి ఆ వ్యక్తికి వీడ్కోలు పలకాలని కుటుంబ సభ్యులే కాదు. సన్నిహితులందరూ ఆశిస్తారు. వీటన్నింటికీ అవకాశం ఇవ్వని బాధాకరమైన చావును ఇస్తుంది కరోనా. వైరస్ సోకిన వ్యక్తి దగ్గరికి ఎవరూ వెళ్లలేరు. ఇక ఆ వ్యక్తి చనిపోతే, కుటుంబ సభ్యులు కూడా దగ్గరికి వెళ్లే పరిస్థితి ఉండదు. మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించరు. సంప్రదాయ రీతిలో అంత్యక్రియలు చేయనివ్వరు. అనాథ శవంలా తీసుకెళ్లి సామూహిక ఖననం చేయాల్సిన దుస్థితి.

కనీసం శ్మశాన వాటికలో ఒక పద్ధతి ప్రకారం మృతదేహాన్ని ఖననం చేసే పరిస్థితి కూడా లేక ఖాళీ ప్రదేశాలు చూసి సామూహిక ఖననాలు చేసేస్తున్న పరిస్థితులు ఇప్పుడు దేశవ్యాప్తంగా చాలా చోట్ల నెలకొన్నాయి. అసలే శ్మశాన వాటికల కొరత ఉన్న పెద్ద నగరాల్లో పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. కరోనా వైరస్  మృతుల ఖననం జరుగుతున్న తీరు చూస్తే గుండె తరుక్కుపోక మానదు. ఇక ఇక అనాథలు కరోనా తో మరణిస్తే వారి పరిస్థితి మరి దారుణంగా వుంది. తాజాగా  తిరుపతిలో కోవిడ్ జేఏసీ గౌస్ బృందం ఆధ్వర్యంలో జరిగిన సామూహిక ఖననం అందరినీ కలచివేసింది. కోవిడ్ బారినపడి మృతిచెందిన 20 మంది అనాథ శవాలకు ఎస్వీ మెడికల్ కళాశాల మార్చురీ నుంచి తరలించి అంత్యక్రియలు చేశారు. కొద్దిరోజులుగా ఎవరూ తీసుకెళ్లాకపోవడంతో రుయా ఆసుపత్రి మార్చురీలోనే మృతదేహాలు వున్నాయి. అనాధ మృతదేహాల ఖననంకి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసి.. పూలమాలలతో  కరోనా  జేఏసీ సభ్యులు, ఎమ్మెల్యే  భూమన కరుణాకర్ రెడ్డి నివాళులర్పించారు.
Tags:    

Similar News