రోడ్డు మీద వెళ్లే వాహనాన్ని మరో వాహనం ఢీ కొట్టటం.. రైలును రైలు.. లేదంటే రైలును రోడ్డు మీద వెళ్లే వాహనం ఢీ కొట్టటం మామూలే. కానీ. గాల్లో ఎగిరే విమానాన్ని బస్సు ఎలా ఢీ కొడుతుందా? అన్న సందేహం అక్కర్లేదు. ఎందుకంటే.. సదరు విమానం గాల్లో ఎగరకుండా నేల మీద నిలిచి ఉంది. అంత పెద్ద విమానాన్ని ఎయిర్ పోర్ట్ లోని ఒక విమానయాన సంస్థకు చెందిన బస్సు డ్రైవర్ ఢీ కొట్టేశాడు.
అదృష్టవశాత్తు విమానంలో ప్రయాణికులు ఎవరూ లేకపోవటంతో పెద్ద ప్రమాదం తప్పిపోయిన పరిస్థితి. ఈ చిత్రమైన వ్యవహారం కోల్ కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటు చేసుకుంది. ప్రయాణికుల్ని ఎక్కించుకొని విమానం వద్దకు తీసుకెళ్లే క్రమంలో రన్ వే మీదున్న ఎయిర్ ఇండియా విమానాన్ని.. జెట్ ఎయిర్ వేస్ కు చెందిన బస్సు ఒకటి బలంగా ఢీ కొంది. దీంతో.. విమానం పాక్షికంగా దెబ్బ తింది. అయినా.. రన్ వే మీద అంత పెద్ద విమానం కనిపిస్తుంటే.. అంతలా ఎలా గుద్దగలిగాడో..?