స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో తాజాగా వచ్చిన చిత్రం 'అల వైకుంఠపురములో'. ఈ సినిమాని హారిక హాసిని క్రియేషన్స్ రాధాకృష్ణ నిర్మించారు. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా కొన్ని ఏరియాల్లో నాన్ బాహుబలి రికార్డులను సైతం కొల్లగొట్టిందట. తమన్ మ్యూజిక్ డైరెక్షన్ లోని ఈ సినిమా పాటలు సినిమాకే హైలెట్ గా నిలిచాయి. ఈ సినిమా విడుదలకు ముందే ఈ సినిమాలోని పాటలు పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసాయనే చెప్పాలి. ఈ చిత్ర విజయంలో ఇవే కీ రోల్ ప్లే చేసాయి. వాటిలో ముఖ్యంగా సామజవరగమన - బుట్ట బొమ్మ - రాములో రాముల వంటి పాటలు రీపీట్ మోడ్ లో మోగుతూ పెద్ద హిట్ అయ్యాయి. ఇక 'బుట్ట బొమ్మ' పాటకు అల్లు అర్జున్ వేసిన స్టైలిష్ స్టెప్పులు అదరగొట్టాయి. థియేటర్లలో ప్రేక్షకులతో ఈలలతో పాటు స్టెప్పులు వేయించింది. నెల రోజుల క్రితం ఈ సినిమాకు సంబంధించిన 'బుట్ట బొమ్మ' ఫుల్ వీడియో సాంగ్‌ను యూట్యూబ్ లో రిలీజ్ చేసారు. ఈ సాంగ్ టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతోంది.
నెల రోజుల్లోనే 'బుట్ట బొమ్మ సాంగ్ ఏకంగా 100 మిలియన్ వ్యూస్ దక్కించుకొని రికార్డు సృష్టించింది. అంటే ఏకంగా పది కోట్ల మంది ఈ పాటను చూశారన్న మాట. ఈ వీడియో సాంగ్స్ లైక్స్ కూడా వన్ మిలియన్ కి చేరుకోవడం మరో విశేషం. అయితే ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి ఇతర హీరోల మధ్య ఈ రికార్డుల గురించి వార్ నడుస్తోంది. నెల రోజుల్లో ఈ సాంగ్ సాధించిన వ్యూస్ ఫేక్ అని యాంటీ బన్నీ ఫ్యాన్స్ అంటున్నారు. అవి ఆర్గానిక్ అండ్ రియల్ వ్యూస్ అని బన్నీ ఫ్యాన్స్ అంటున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో ఉండేదే పది కోట్ల మంది - ఈ సాంగ్ కి పది కోట్ల వ్యూస్ నెల రోజుల్లో వచ్చాయా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీనికి ప్రతిగా అల్లు ఫ్యాన్స్ 'బన్నీకి ఆల్ ఓవర్ ఇండియా ఫ్యాన్ బేస్ ఉంది, అందుకే ఈ వ్యూస్ వచ్చాయి. అయినా తెలుగు రాష్ట్రాల్లో పది కోట్ల మంది ఉంటే ఫ్యాన్స్ అందరూ ఒక్కొక్కడు పది సార్లు చూస్తే అన్ని వ్యూస్ రావా' అంటూ విరుచుకుపడుతున్నారు.
ఇతర హీరోల ఫ్యాన్స్ 'ఇవి ఫేక్ రికార్డ్స్ అని - బన్నీ పీఆర్వో తలచుకుంటే ఇలాంటివి ఎన్నో తెప్పించగలదని' కామెంట్ చేస్తున్నారు. మరి నెల రోజుల్లో 'బుట్ట బొమ్మ'కు వచ్చిన వ్యూస్ రియల్ అండ్ ఆర్గానిక్ వ్యూసా - ఫేక్ వ్యూసా అనేది వాళ్ళకే తెలియాలి. ఏదేమైనా ఈ మధ్య సోషల్ మీడియాలలో ఫ్యాన్స్ వార్స్ తారా స్థాయికి చేరుకుంటున్నాయి. కరోనా నేపథ్యంలో ఇంట్లోనే ఉండటంతో ఇవి ఇంకా ఎక్కువ అవుతున్నాయి.