ఏపీలో మరో కొత్త టాపిక్ ఇపుడు విపరీతంగా ప్రచారంలో ఉంది. జగన్ మంత్రివర్గాన్ని ఎపుడు విస్తరిస్తారు అంటే అది ఎవరికీ తెలియని జవాబే. ఎందుకంటే దాన్ని అధినాయకుడు జగన్ తనకు తానుగా ఎక్కడా రివీల్ చేయరు. దాంతో ఎవరికి తోచిన తీరున వారు దీని మీద అలా చర్చించుకోవడమే. అయితే కచ్చితంగా ఏదో ఒక రోజున మంత్రివర్గ విస్తరణ అయితే ఉంటుంది అన్నది జరుగుతున్న ప్రచారం.
ఇక ఏపీలో మంత్రి వర్గ విస్తరణకు ఇపుడు కొత్త ముహూర్తాన్ని కూడా ముందుకు తెచ్చారు. ఈ ఉగాది తరువాత ఎపుడైనా మంత్రి వర్గ విస్తరణ ఉంటుంది అంటున్నారు. దానికి కారణాలు కూడా చూపిస్తున్నారు. అదెలా అంటే అప్పటికి కొత్త జిల్లాల ఏర్పాటు పూర్తి అవుతుంది. అంటే 26 జిల్లాలుగా ఏపీ అవుతుంది. దాంతో 26 జిల్లాల నుంచి ప్రతీ జిల్లాకు ఒకరు వంతున అవకాశం ఇస్తారని అంటున్నారు.
అదే టైమ్ లో పాత వారిని మొత్తం తొలగిస్తారు అని కూడా చెప్పుకుంటున్నారు. గతంలో అయితే కొందరు కొత్త కొందరు పాత అంటూ కూడా ప్రచారం సాగింది. అంటే అనుభవం, నూతనత్వం అలా మిక్స్ చేసి మరీ కూర్పు ఉండవచ్చు అని భావించారు. అయితే లేటెస్ట్ గా వస్తున్న ప్రచారం ఏంటి అంటే టోటల్ గా కొత్తవారేనట.
అంటే ఒక్క జగన్ తప్ప మంత్రులు మొత్తం కొత్తవారే అన్న మాట. ప్రస్తుత మంత్రివర్గంలో అయిదారుగురు సీనియర్లు ఉన్నారు. దాంతో క్యాబినేట్ రధాన్ని సజావుగానే నడిపించుకుని వచ్చారు. మరి వచ్చేది ఎన్నికల సమయం. తట్టుకోవాలంటే నోరున వారే కాదు, పేరున్న వారు అనుభవం ఉన్న వారూ అవసరం పడతారు. కానీ జగన్ వినూత్నంగానే ఇక్కడ ప్రయోగం చేస్తున్నారు అని అంటున్నారు.
అంటే టోటల్ చేంజ్ అంటూ జగన్ మంత్రి వర్గం ఉంటుందని చెబుతున్నారు. అలా కొత్త వారికి చాన్స్ దక్కేదెవరికి అంటే ఎవరికి వారు తమకే అని కూడా లెక్కలు వేసుకుంటున్నారు. ఇందులో కొందరు అయితే గ్యారంటీగా తమకే అమాత్య కిరీటం అని ధీమాగా ఉన్నారు. మరి వారికి ఆ నమ్మకం ఎలా వచ్చింది అంటే ఏదైనా మ్యాటర్ లీక్ అయిందా అన్న డిస్కషన్ కూడా నడుస్తోంది.
అయితే మంత్రి వర్గం కూర్పు విషయంలో జగన్ మార్క్ లిస్ట్ రెడీ అయిపోయిందని, ఆయన కొందరితో మాట్లాడుతున్న మాటలు కానీ వారి పట్ల ప్రత్యేకంగా చూపిస్తున్న శ్రద్ధ కానీ గమనించిన వారు కచ్చితంగా కాబోయే మంత్రులు వారే అని అనుకుంటున్నారుట. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి.
ఈ సమావేశాలలో ఒక్కటిగా చేరుతున్న వైసీపీ ఎమ్మెల్యేలు కాబోయే మంత్రులు మీరంటే మీరే అని చెప్పుకుంటున్నారుట. మరి ఎవరు కొత్త మంత్రులు అన్నది మాత్రం జగన్ పిలుపు అందుకుని ప్రమాణ స్వీకారం చేసేదాకా ఎవరికీ తెలియదు అన్నది వాస్తవం. అంతవరకూ ఈ ప్రచారం జరగడం కామన్. అంతే.