ఏపీలో మంత్రుల సందడి అసలు కనిపించడంలేదు. మంత్రివర్గ విస్తరణ విషయం చర్చకు రాగానే ప్రస్తుతం జగన్ క్యాబినేట్ లో ఉన్న ఇరవై మూడు మంత్రి మంత్రులలో ముగ్గురు నలుగురు తప్ప అంతా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. బడ్జెట్ సమావేశాలు ఇలా ముగిసాయో లేదో ఎవరి ప్రాంతాలకు వారు వచ్చేశారు. ఆ మీదట చాలా మంది హడావుడి చేయడం పూర్తిగా తగ్గిపోయింది.
ఇక డైలీ మీడియాలో కనిపించే మంత్రులు కూడా ఇపుడు పెద్దగా ముందుకు రావడంలేదు. ఏపీలో విద్యుత్ చార్జీల ఇష్యూ చాలా పెద్దగా మారుతోంది. విపక్షాలకు అంది వచ్చిన అస్త్రంగా ఉంది. అదే టైం లో దీన్ని భారీ ఎత్తున నిర్వహించడం ద్వారా సర్కార్ మీద పోరాటాన్ని పీక్స్ తీసుకెళ్ళాలని అంతా చూస్తున్నారు.
ఇక ఏపీలో విద్యుత్ షాకులు అంటూ విపక్షాలు విమర్శలు చేస్తూంటే సరైన టైం లో సర్కార్ నుంచి కౌంటర్లు ఇచ్చేవారు లేకుండా పోయారు. అక్కడికీ విద్యుత్ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినా అది గట్టిగా సౌండ్ చేసేదిగా లేదు. మరో వైపు ఏపీలో అన్ని రకాలుగా ధరలు పెరిగాయని దేశంలోనే ధరాభారం ఉన్న స్టేట్ ఏపీ అని సీపీఐ రామక్రిష్ణ విమర్శిస్తున్నారు.
దాంతో సంబంధిత మంత్రులు ఎవరూ నోరు విప్పడంలేదు. ఉత్తరాంధ్రా జిల్లాలను తీసుకుంటే చాలా కాలంగా ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి మౌనంగానే ఉంటూ వస్తున్నారు. గత కొద్ది రోజులుగా అవంతి శ్రీనివాసరావు కూడా అలాగే ఉంటున్నారు. ఇక ధర్మాన క్రిష్ణ దాస్ అయితే వచ్చే ఎన్నికల్లో వైసీపీదే గెలుపు అంటున్నారు, సవాళ్ళు విసురుతూ రాజకీయాన్ని వేడెక్కిస్తున్నారు.
సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ అయితే శాఖాపరంగా మాట్లాడంలేదు. చెత్త పన్ను వసూల్ చేయకపోతే జీతాలు కట్ అంటూ ఆయన సొంత జిల్లా విజయనగరం లోని పార్వతీపురంలో మునిసిపల్ అధికారులు వార్నింగులు ఇస్తున్నారని మీడియా కోడై కూస్తోంది. అయినా మంత్రి దానిమీద మాట్లాడడంలేదు. ప్రపంచంలోనే చెత్త మీద పన్ను వేసే ఏకైక ప్రభుత్వం జగన్ ది అని చంద్రబాబు హాట్ కామెంట్స్ చేసినా నో రిప్లై.
ఉభయ గోదావరి జిల్లా మంత్రులలో తానేటి వనిత మూడేళ్ళుగా పెద్దగా హడవుడి చేసింది లేదు. ఇపుడు మరింతగా ఆమె సైలెంట్ అయ్యారు. ఎపుడూ మీడియాలో మెరిసే మంత్రి కురసాల కన్నబాబు కూడా డల్ అయ్యారని అంటున్నారు. చెరుకువాడ శ్రీరంగనాధరాజు, ఆళ్ళ కాళీ క్రిష్ణ శ్రీనివాస్ పెద్దగా మాట్లాడరు. అలాగే పినిపె విశ్వరూప్ కూడా.
ఇక ఫైర్ బ్రాండ్స్ గా ఉండే మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, పేర్ని నాని, కొడాలి నాని కూడా దూకుడు తగ్గించేశారు. ఇపుడు వారు మీడియా ముందుకు రావడంలేదు. హోం మంత్రి మేకతోటి సుచరిత సాహా చాలా మంది మంత్రులు లో ప్రోఫైల్ మెయింటెయిన్ చేస్తారు. మొత్తానికి చూస్తే గతంలో ప్రతీ విషయం మీద మీడియా ముందుకు వచ్చే వెల్లంపల్లి శ్రీనివాస్ వంటి వారు కూడా ఇపుడు ఎందుకో పెదవి విప్పడంలేదు.
మొత్తానికి చూస్తూంటే ఒక్కటే అందరి బాధగా ఉంది. తమ పదవులు పోతున్నాయి. తాము మాజీలు కాబోతున్నామని. జగన్ పార్టీ పదవులు ఇస్తామని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలిస్తే మళ్లీ మీరే మినిస్టర్స్ అని బంపర్ ఆఫర్ కూడా ఇచ్చారు. అయినా మంత్రులు మాత్రం ఈ హామీల మీద అంతగా హ్యాపీగా లేరు అనే అంటున్నారు. అందుకే వారు సైలెంట్ మోడ్ లో ఉన్నారని ప్రచారం సాగుతోంది.
మరి ఇలా ఎంత కాలం, సర్కార్ తరఫున కౌంటర్లు ఇచ్చే సీన్ లేదా. మీడియా విపక్షం సైడే తీసుకుంటుందా అంటే కొద్ది రోజులు ఆగాలి. కొత్త మంత్రులుగా వచ్చిన వారు మీడియాతోనే ఇక మీదట ఉంటారు. అంతవరకూ అంటే ఏప్రిల్ 11 వరకూ ఈ నిశ్శబ్దం తప్పదు అంటున్నారు.